Sunday, 13 September 2026 07:14:51 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ

Date : 07 June 2026 09:46 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -జూన్ 07 : మదనపల్లి పట్టణం అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఎన్.సి.సి విభాగానికి చెందిన ద్వితీయ సంవత్సరం మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి క్యాడెట్ రామిరెడ్డి లక్ష్మణ్ మరియు ప్రథమ సంవత్సరం సైబర్ సెక్యూరిటీ విద్యార్థిని క్యాడెట్ మల్లెపుల భార్గవి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో మే 25 నుండి జూన్ 3, 2026 వరకు నిర్వహించిన ప్రతిష్టాత్మక సండక్ఫూ హిమాలయన్ ట్రెక్కింగ్ ఎక్స్‌పెడిషన్‌లో పాల్గొన్నారు. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల ఎన్‌సీసీ డైరెక్టరేట్ నుంచి ఎంపికైన ఇద్దరు క్యాడెట్లు మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు కావడం గర్వకారణమని అన్నారు. ఈ సాహస యాత్రలో ఇండోర్ రాక్ క్లైంబింగ్ పోటీలు, ట్రీ టాప్ పోటీలు, ఇండో-నేపాల్ సరిహద్దు వెంబడి ధోత్రే నుంచి శ్రీఖోలా వరకు 68 కిలోమీటర్ల కఠిన ట్రెక్కింగ్, సండక్ఫూ సన్‌రైజ్ వ్యూపాయింట్ యాత్ర, 22 కిలోమీటర్ల టైగర్ హిల్–డార్జిలింగ్ ట్రెక్ వంటి అనేక సాహస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఇండోర్ రాక్ క్లైంబింగ్ పోటీలో క్యాడెట్ మల్లెపుల భార్గవి దేశవ్యాప్తంగా పాల్గొన్న ఎన్‌సీసీ క్యాడెట్ల మధ్య తృతీయ స్థానం సాధించి యూనివర్సిటీ కు మరింత కీర్తిని తీసుకొచ్చిందని తెలిపారు తమ విజయానికి సహకరించిన 35 ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ ఎన్.సి.సి, చిత్తూర్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ . ఎన్..వి. మోనిస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి.లోగనాథన్ మరియు ఎన్‌సీసీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ తిరుపతి వారికి క్యాడెట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్రెకింగ్ లో ప్రతిభ చూపిన క్యాడెట్లను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, ఎన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: