నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 04 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్‌డ్ టు బీ యూనివర్సిటీ నందు విధాత తెలుగు సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది అని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు . ఈ సందర్భంగా చిత్ర బృందం విద్యార్థులతో మమేకమై సినిమా విశేషాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ మరియు హీరో అయిన అప్పినపల్లి భాస్కర చారి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా వీక్షించదగిన కథాంశంతో పాటు విలువలతో కూడిన వినోదాన్ని అందించే ప్రయత్నమే ఈ సినిమా ముఖ్య ఉధ్యేషమని తెలిపారు. మంత్రముగ్ధులను చేసే మా సినిమా టీజర్ ఇప్పటికే అభిమానులలో సంచలనం సృష్టించాయి, ఇది సినిమా విడుదల కోసం అంచనాలను పెంచింది అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా నటీనటులు తమ అనుభవాలను పంచుకుంటూ, యువత ఆశీస్సులు మరియు ప్రేక్షకుల ఆదరణే తమకు ప్రధాన బలమని పేర్కొన్నారు. మిట్స్ యాజమాన్యం విద్యార్థులకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలియజేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. విధాత సినీ బృందం విద్యార్థులతో సినీ విశేషాలపై ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు,మిట్స్ ఫిలిం మేకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ రియాజ్ అలీ , ఆర్ట్స్ అండ్ కల్చరల్ కోఆర్డినేటర్ వై. ప్రదీప్ కుమార్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News