నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 16 : తంబళ్లపల్లె మండలంలో రీసర్వేలో పేరుకుపోయిన ప్రతి సమస్యను పరిష్కారానికి ముందుంటానని తాహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా మండలంలోని పలువురు రైతులు తమ సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు చేశారు. ఈ విషయమే తాసిల్దార్ ప్రతి సమస్యను రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, వీఆర్ఏలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి పరిష్కారానికి పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. రైతులకు సంబంధించిన జాయింట్ ఎల్పీఎంలు, ఇతరత్రా రెవిన్యూ సమస్యలు వస్తున్నాయని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిస్థాయి లో పరిష్కరించి పక్కాగా పాస్బుక్కులు పంపిణీ చేపడుతున్నట్లు చెప్పారు. రైతులు సమన్వయం పాటించి రెవిన్యూ అధికారులకు సమస్యల పరిష్కారానికి కలిసి రావాలన్నారు. ఈ గ్రీవెన్స్ లో ఆర్ ఐ ముద్దుకృష్ణ, మండల సర్వేయర్ నాగరాజు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
Reporter
Namitha News