Monday, 14 September 2026 08:35:39 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు శ్రీకారం - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పోస్టర్ల విడుదల

Date : 23 March 2026 08:55 PM Views : 346

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23: అన్నమయ్య జిల్లాలో క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సమర్థవంతమైన చికిత్స అందించడం ద్వారా టిబి వ్యాధిని పూర్తిగా నిర్మూలించి... క్షయ వ్యాధి రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా, మార్చి 24, 2026 నుండి ప్రారంభమవుతున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ – 100 రోజుల కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం కలెక్టర్ కార్యాలయం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం లో క్షయ వ్యాధి రహిత ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో కలిసి విడుదల చేశారు

ఈ 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో మూడు దశల్లో అమలు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు . హై రిస్క్ గ్రామాలు, కాంగ్రీగేట్ ప్రదేశాలు మరియు వల్నరబుల్ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని స్క్రీనింగ్ నిర్వహించ బడుతుంది. ప్రతిరోజు ఒక హై రిస్క్ గ్రామంలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తూ అన్ని గ్రామాలను కవర్ చేయడం లక్ష్యంగా నిర్ణయించారు. శిబిరాల్లో ఛాతీ ఎక్స్-రే సహా అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించబడతాయి. స్క్రీనింగ్ చేసిన ప్రతి వ్యక్తి వివరాలను నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి నరసయ్య, అదనపు డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ రాధిక మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :