Monday, 14 September 2026 05:26:05 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు

Date : 13 September 2026 06:48 PM Views : 10

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు మదనపల్లె : మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలోని మిట్స్ సోషల్ రెస్పాన్సిబుల్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.వినాయక చవితిని పురస్కరించుకొని ఎకో బప్పా మోరియా 3.0 కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ప్రాంగణంలో ఆదివారం మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలను నిర్వహించారు.ఈ పోటీల్లో మొత్తం 74 బృందాలు ఉత్సాహంగా పాల్గొని వివిధ ఆకృతుల్లో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను రూపొందించారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ వినాయక చవితి హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ అని,అయితే రసాయనాలు,హానికర పదార్థాలతో తయారు చేసే విగ్రహాల వల్ల నీటి వనరులు,పర్యావరణం కలుషితమవుతున్నాయన్నారు.ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు.మట్టి వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడమేనని,మట్టి మన జీవనానికి ఆధారమైన సహజ వనరు కాబట్టి మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.విద్యార్థులు రూపొందించిన మట్టి వినాయక విగ్రహాలను పరిశీలించిన అనంతరం మొదటి బహుమతిని ఆర్.అనూష అండ్ టీం,రెండవ బహుమతి ఎస్ లహరి అండ్ టీం మరియు మూడవ బహుమతి అభిషేక్ అండ్ టీం విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డీన్-అక్రిడిటేషన్స్ డాక్టర్ ఏ.వి పవన్ కుమార్,సి.ఎస్.టి విభాగాధిపతి డాక్టర్ దినేష్,ఎంఎస్ ఆర్ క్లబ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.రెడ్డి హేమంత,శాయీజ్ అహమ్మద్,డాక్టర్ నవీన్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :