Sunday, 13 September 2026 09:12:53 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ విద్యార్థులకు ఆధునిక పరిజ్ఞానం తో విజువల్ విశ్లేషణ

Date : 24 April 2026 10:42 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 24 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం వారు జే.ఎన్.టి.యూ, అనంతపూర్ వారి సహకారంతో ఆధునిక డేటా సాధనాలతో దృశ్యీకరణ ఆధారంగా ముందస్తు విశ్లేషణ” అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుదుచ్చేరి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నందు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్ ప్రవీణ్ పాల్గొన్నారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో డేటా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆ డేటాను అర్థం చేసుకోవడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం అని అన్నారు. డేటాను గ్రాఫ్‌లు, చార్ట్‌లు వంటి దృశ్య రూపంలో చూపించడం వల్ల క్లిష్టమైన సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా గత డేటాను విశ్లేషించి భవిష్యత్తులో జరిగే పరిణామాలను ముందుగానే అంచనా వేయవచ్చు. ఇది వ్యాపారం, విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో ప్రణాళికలు రూపొందించడంలో మరియు సమస్యలను ముందుగానే గుర్తించడంలో ఉపయోగపడుతుందని అన్నారు. ఆధునిక డేటా టూల్స్ అయిన పవర్ బి.ఐ, పైథాన్, ట్యాబ్లు వంటి సాధనాలను ఉపయోగించడం ద్వారా విశ్లేషణ వేగవంతంగా, ఖచ్చితంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఈ సాధనాలను ఉపయోగించడం ద్వారా విద్యా రంగంలో బోధన మరింత సమర్థవంతంగా మార్చి, విద్యార్థులకు ప్రాక్టికల్ జ్ఞానం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఐటీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఈ-కామర్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అధ్యాపకులు తమ బోధనా విధానాలను మరింత ఆధునికంగా మార్చుకొని, వారు నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు ప్రాక్టికల్‌గా బోధించడం ద్వారా వారి అవగాహనను పెంచుకొని, పరిశోధన మరియు ప్రాజెక్టులలో కొత్త అవకాశాలను అన్వేషించగలరు అని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్ .కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ కే.నిర్మల దేవి, తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. బి రాజేష్, మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్ ట్రైనర్, ఆశు దేవ్, బెంగళూరు మరియు 50 మందికిపైగా అధ్యాపకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: