Sunday, 13 September 2026 06:53:51 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

వాయల్పాడు, పీలేరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 21 January 2026 08:53 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం రాయచోటి సబ్ డివిజన్ పరిధి లోని వాయల్పాడు మరియు పీలేరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ల లోని రికార్డులను, లాకప్ రూమ్ ను మరియు పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో ఎస్పీ పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ముఖ్య సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. బాధితులకు భరోసా కల్పించి, వారి సమస్యలను చట్టభద్ధంగా త్వరితగతిన పరిష్కరించాలి. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలి. పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలి. పెండింగ్‌లో ఉన్న కేసులను శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు చేసి, త్వరితగతిన ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలి. మహిళలు, పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా నేరాల ఛేదనలో వేగం పెరుగుతుందని సూచించారు. సిబ్బంది సంక్షేమ పై దృష్టి సారించాలని, ఆయా పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించారు.

ప్రజలకు నిద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులకు ఓటిపి లు చెప్పవద్దని, ఏదైనా మోసం జరిగితే వెంటనే 1930 కి ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామాలలోని కొత్త వ్యక్తుల గురించి లేదా అనుమానాస్పద కదలికల గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్పీ మహేంద్ర , పీలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ , ఎస్ఐలు లోకేష్, ఎస్ రహీం, వాయల్పాడు ఎస్ఐ తిప్పేస్వామి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: