నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 17 : తంబళ్లపల్లె మండల అభివృద్ధికి అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు, అధికార పార్టీల నాయకుల సమన్వయంతో కలిసికట్టుగా పని చేద్దామని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. బుధవారం ఆమె ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టి అధికారులతో సమీక్ష జరిపి మండలంలోని సమస్యల ను క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించి అక్కడికక్కడే పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని విధి నిర్వహణలో ప్రజలకు జవాబుదారీగా నిలవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ను ప్రజల చెంతకు చేర్చి అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, ఉపాధి హామీ, మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎం.వి.ప్రసాద్, మారుతీకుమార్, ఏవో థామస్ రాజా, ఏపీవో అంజనప్ప, ఏపిఎం గంగాధర్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News