నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 17 ః తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని మల్లయ్య కొండలో సంక్రాంతి పండుగ సందర్భంగా వందలాదిగా భక్తులు మల్లికార్జున స్వామి కి ప్రత్యేక పూజలు, అర్చనలు , అభిషేకాలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో చెక్కభజనలు, కోలాటాలు, పండరి భజనలు నిర్వహించి అలరించారు. గురువారం రాత్రి కళాకారులు శివనామస్మరణ తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా మల్లయ్య కొండకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో మల్లయ్య కొండ భక్తులతో కిటకిటలాడింది. అదేవిధంగా కోసువారిపల్లి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం, చంద్రమౌలేశ్వరాలయం, తంబళ్లపల్లి కోదండ రామాలయం, శివాలయం, సాయిబాబా ఆలయం, గంగిరెడ్డిపల్లి మద్దెమ్మ ఆలయం, కుక్క రాజు పల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు
Reporter
Namitha News