Sunday, 13 September 2026 11:56:57 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రైతుల భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వం ధ్యేయం - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

Date : 05 November 2025 10:58 PM Views : 283

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 05 : తంబళ్లపల్లె మండలం లో పేరుకుపోయిన దీర్ఘకాలిక రైతుల భూuముల సమస్యల పరిష్కారానికి తంబళ్లపల్లి రెవెన్యూ కార్యాలయంలో బుధవారం సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, తాహసిల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి అధ్యక్షతన రైతుల సమక్షంలోనే బుధవారం తంబళ్లపల్లె తాహసిల్దార్ కార్యాలయ ఆవరణంలో తాహసిల్దార్ శ్రీనివాసులు రెవిన్యూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పాల్గొని మండలంలోని రైతులు మండలంలో దీర్ఘకాలికంగా నిలిచిన భూ సమస్యలు, రీ సర్వేలో జరిగిన పొరపాట్లు, ఇంకా పలు రకాల భూ సమస్యలపై గ్రామ సభలోనే రైతులు, అధికారులతో విచారణలు నిర్వహించి అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక కోసం 112 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సబ్ కలెక్టర్ ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యలపై అధికారి యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదని నిర్దేశిత కాల పరిమితిలో పనులు జరగాలని సూచించారు. రైతులు సైతం అధికారులకు సహకరించి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అనంతరం 107 మంది రైతులకు జాయింట్ ఎల్.పి.ఎం. పొజిషన్ సర్టిఫికెట్లు, ముటేషన్ ట్రాన్సాక్షన్ కరక్షన్స్, లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆర్.ఓ.ఆర్ అప్పీళ్లు పై విచారణ తో పాటు పరిష్కార మార్గాలకు మార్గం సుగమం చేశారు. తంబళ్లపల్లె మండలంలో దశాబ్దాలుగా పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడంపై సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, తాహసిల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారుల ను గ్రామసభలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నవీన్, రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: