Monday, 14 September 2026 09:49:39 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

కోటకొండ లో జలజీవన్ పనులకు ఆర్ & బి బ్రేక్

ఉన్నతాధికారులు స్పందించండం లేదని విస్తుపోతున్న కాంట్రాక్టర్లు

Date : 23 February 2026 10:25 PM Views : 282

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 23 ః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్ మిషన్ పథకానికి ఆర్ అండ్ బి అధికారులు అడుగడుగునా పనులకు బ్రేక్ వేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన తంబళ్లపల్లె మండల కేంద్రంలో జలజీవన్ మిషన్ పైప్ లైన్ wj పనులను ఆర్ అండ్ బి అధికారులు అడ్డు తగలగా అప్పట్లో ఆర్డబ్ల్యూఎస్ డిఆర్ఈవో సతీష్ కుమార్, డి.ఈ చంద్రశేఖర్ రెడ్డి, డిపిఎం సంజయ్, ఏఈఈలు వినోద్ కుమార్, దినేష్, రియాజ్ లు తరలివచ్చి సమస్య పరిష్కారానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడారు. ఈ విషయం మరువకనే సోమవారం సాయంత్రం మండలంలోని కోటకొండ వద్ద జరుగుతున్న జలజీవన్ పైప్లైన్ పనులను ఓ ఆర్ అండ్ బి అధికారి అడ్డుకున్నారు. పైపులైన్ పనులకు అనుమతి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు కాంట్రాక్టర్ జగన్నాథన్ సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ డీఈ తో ఫోన్లో మాట్లాడారు. వారి నుండి సానుకూల సమాధానం రాకపోవడంతో ఆయన జలజీవన్ మిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తంబళ్లపల్లె మండలంలో జల జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు శరవేగంగా జరుగి దాదాపు పూర్తికావస్తున్నాయి. ఈ నేపథ్యంలో పైప్ లైన్ పనులను అడుగడుగునా ఆర్ అండ్ బి అధికారుల అడ్డుకోవడం తో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో జలజీవన్ పథకానికి ఆదిలోనే హంసపాదు చందాన తయారయింది. తంబళ్లపల్లె నియోజకవర్గం వేసవిలో తరచూ తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటి.ఈ సమస్యపై స్పందించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కింద తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గవర్గాలకు రూ 2370 కోట్లతో ప్రతి ఇంటికి స్వచ్ఛ నీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి ప్రజాహిత బృహత్ కార్యక్రమాలకు తరచూ అడ్డంకులు రావడం తో ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తలనొప్పిగా మారింది. శాశ్వత తాగునీటిa సమస్య పరిష్కారం అవుతుందని ఆశపడిన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ సమస్య శాపంగా నిలవడం పై ప్రజలు విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తో పాటు జిల్లా ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి జల జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు త్వరగా పూర్తిచేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :