Monday, 14 September 2026 07:36:06 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

దిగువ గొల్లపల్లి లో చామంతి పూల తోటను పరిశీలించిన కలెక్టర్

Date : 28 February 2026 09:03 PM Views : 275

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం/ సోమల - ఫిబ్రవరి 28 : శనివారం ఉదయం సదుం, సోమల మండలాలలో ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేయడానికి ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం కింద చేపడుతున్న పనులలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలోని T17- పి పి సి రోడ్డు నుండి పి పి సి రోడ్డు వరకు పొట్టెంవాయిపల్లె తిమ్మనాయని పల్లె ద్వారా పొడవు 0.00 కి. మీ నుండి 9.97కి. మీ వరకు జి ఎస్ బి మరియు డబ్ల్యూ ఎం ఎం పూర్తయిన పనులను మరియు సోమల మండలంలో కలికిరి రోడ్డు నుండి నిమ్మనపల్లె మండల సరిహద్దు కందూరు వరకు 8.00 కి. మీ నుండి 15.38 కి. మీ వరకు పూర్తయిన పనులను స్వయంగా పరిశీలించారు. ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం కార్యక్రమంలో పూర్తి చేయాల్సిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా నిర్మాణంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, ప్రతి దశలో సాంకేతిక ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. సదుం మండలం, చింతపర్తి వారి గ్రామపంచాయతీ పరిధిలోని దిగువ గొల్లపల్లి సమీపంలోని రైతు గంగిరెడ్డి సాగు చేస్తున్న చామంతి పూల తోటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంట సాగు విధానం, దిగుబడి, పండించిన పూలను స్థానిక మార్కెట్లతో పాటు సమీప పట్టణాలకు విక్రయిస్తున్నట్లు రైతు కలెక్టర్కు వివరించారు. పూలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంబించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయంలో వైవిధ్యీకరణ ద్వారా రైతుల ఆదాయం పెంపు ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, ఉద్యాన పంటల సాగుపై మరింత దృష్టి రైతులు సారించాలని అవసరమైన సాంకేతిక సలహాలు, ఉద్యానవన శాఖ ద్వారా సహాయం అందిస్తామని రైతుకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో ప్రాజెక్టు అమలు విభాగం ఏఈఈ ప్రవళిక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :