నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 21 ః తంబళ్లపల్లె మండలంలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. క్రాస్ రోడ్ లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, మండల కన్వీనర్ రేపన చౌడేశ్వర, కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ8 సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జగన్ చిత్రపటం ముందు భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఎన్నడూ లేనివిధంగా మహిళలు, చిన్నారులు వేసిన కోలాటాలు ఆకట్టుకోగా పెద్ద ఎత్తున బాణసంచా పేలుళ్లతో మండల కేంద్రం మారుమ్రోగింది. పరసతోపు సర్పంచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నియోజకవర్గ అబ్జర్వర్ రాకేష్ రెడ్డి, యువ నాయకుడు ఎర్రగుండ్లపల్లి శివారెడ్డి, సర్పంచులు సుధాకర్ రెడ్డి, మౌలాలి, బాబు రెడ్డి, వాట్ షిప్ చైర్మన్ పెద్ద శేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీరాములు,మండలంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వాటర్ షెడ్ చైర్మన్లు,వైయస్సార్ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News