Tuesday, 15 September 2026 08:52:10 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మాదిగ బిడ్డలు చదువుకొని రిజర్వేషన్లు పొందాలి - ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డానియల్ మాదిగ

Date : 20 May 2026 09:01 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే20 : దశాబ్దాలుగా అణగారిన మాదిగ జాతి బిడ్డలు నేడు ప్రతి ఒక్కరు చదువుకుని పోరాటంతో సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలను పొందాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డానియల్ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం మండల అధ్యక్షుడు గంగాధర్, ఇంచార్జ్ వేటా మల్లికార్జున, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటప్ప ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు 50 గోటు విలేజ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం లోని చదువుకు దూరంగా ఉన్న మాదిగ జాతి బిడ్డలను గుర్తించి స్థానికంగా గల పాఠశాలల్లో చేర్పించడంతో బాటు విద్యార్థులు, యువతి యువకులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టి వంద శాతం మాదిగ బిడ్డలు చదువుకుని భవిష్యత్తులో వారు ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎమ్మార్పీఎస్ నాయకులు నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి మండలాలు, నియోజకవర్గ ఇన్చార్జిలు కృషి చేయాలని నిర్లక్ష్యం చేసే వారిపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, రాములమ్మ, రెడ్డమ్మ, ఆదినారాయణ, నరసింహులు, రెడ్డప్ప, రెడ్డప్ప నాయుడు, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :