Monday, 14 September 2026 10:10:42 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మిట్స్ లో అవగాహన సదస్సు

ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యం లో ఘనంగా క్యాన్సర్ అవగాహన సదస్సు

Date : 04 February 2026 08:02 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 04 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మదనపల్లి స్వస్థత హాస్పిటల్, చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ ఆదర్శ్ రెడ్డి పాల్గొని, విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుండగా భారత్‌లో అధికంగా ఉండడం ఆందోళనకరమని, జీవనశైలి మార్పులు, జంక్ ఫుడ్, మధుపానం, మద్యపానం, పొగత్రాగడం, అధిక ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం వంటి అలవాట్లు క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని తెలిపారు. క్యాన్సర్ గొంతు, ఊపిరితిత్తులు, చర్మం, ఉదరం, బ్రెస్ట్ వంటి శరీర భాగాలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, అయితే మొదటి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ నాలుగు దశల్లో ఉంటుందని, ప్రారంభ దశలో చికిత్స పొందితే వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొంటూ తమ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు ప్రత్యేక సదస్సులు, చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ ఎక్కువ కాలం ప్లాస్టిక్ వినియోగం చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారని. కాబట్టి ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాల వాడకాన్ని తగ్గించి, స్టీల్ లేదా గాజు పాత్రలను ఉపయోగించడం, ప్లాస్టిక్‌లో వేడి ఆహారం పెట్టకపోవడం, ప్లాస్టిక్‌ను కాల్చకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మన భవిష్యత్తు తరాల వారిని క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చని తెలిపారు. స్వస్థత హాస్పిటల్‌తో మిట్స్ యూనివర్సిటీ కుదుర్చుకున్న ఎంఓయూ‌లో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ & అసిస్టెంట్ డైరెక్టర్, ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎం. బాలాజీ, డాక్టర్ ఆర్. చెన్నయ్య , కోఆర్డినేటర్లు జి. కుమార్, డాక్టర్ బి. సింహాద్రి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: