Monday, 14 September 2026 07:37:31 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

గుండ్లపల్లి లో ప్రకృతి వ్యవసాయం తో వికసించిన ప్రకృతి వ్యవసాయ ఫలాలు

ఫోర్డ్ సంస్థ అవగాహనే ఆదర్శం

Date : 21 March 2026 09:00 PM Views : 364

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 21ః రసాయన ఎరువులు, క్రిమిసంహారాలతో పండిన ఫల సాయంతో నేటి సమాజం ఆరోగ్యాలు క్షీణించి నిత్యం ఆసుపత్రుల పాలవుతున్న తరుణంలో ఎడారిలో ఒయాసిస్ లా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల ప్రేరణతో ప్రకృతి వ్యవసాయ పంటల సాగు తంబళ్లపల్లెలో పోర్డు సంస్థ అవగాహనతో పురుడు పోసుకోవడం హర్షనీయం. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లె పంచాయతీలో ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జె. లలితమ్మ ఏడాదిగా ప్రకృతి వ్యవసాయం పై స్థానిక రైతులకు రైతు యాత్రలు,అవగాహన సదస్సులు నిర్వహించి వారిలో చైతన్యం నింపి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడవడానికి పునాదులు వేశారు. ఫోర్డ్ సంస్థ చేసిన ప్రయత్నం ఫలించి నేడు గుండ్లపల్లి పంచాయతీ లో పలువురు రైతులు ప్రకృతి వ్యవసాయ పంటల ఫలాలతో సత్ఫలితాలు సాధించి విజయకేతనం ఎగరవేశారు. ప్రకృతి వ్యవసాయం లో భాగంగా సేంద్రియ ఎరువులు, పేడ ఎరువు, కషాయాలతో వేరుశనగ, మామిడి, మొక్కజొన్న, సుమారు 30 రకాల చిరుధాన్య పంటలు, ఆకుకూరలు, కూరగాయల పంటలు పండించడంతోపాటు అధిక దిగుబడి సాధించారు. ఇందులో భాగంగా శనివారం ఫోర్డ్ డైరెక్టర్ లలితమ్మ, రమణ, సంపూర్ణ, హేమంత్, ఏ పి సి ఎన్ ఎఫ్ ప్రతినిధి రాజు గుండ్లపల్లి ప్రకృతి వ్యవసాయ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను అభినందించారు. రైతు నరసింహులు వేసిన మామిడి, అంతర్ పంట వేరుశనగ ఎకరాకు 15 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పడం తో ప్రకృతి వ్యవసాయం లో నైతిక విజయం సాధించి గుండ్లపల్లి రైతులు ఆదర్శంగా నిలిచినట్లు లలితమ్మ కొనియాడారు. అదేవిధంగా మరో రైతు మనోహర్ తనకున్న కొద్దిపాటి పొలంలో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలు పంటలు పండించి లబ్ధి పొందడం విశేషం. ప్రతి రైతు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి సారిస్తే రైతుల పొలాలు భూసారం పెరిగి పండిన ఫల సాయం మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణం పరిరక్షణ కలుగుతుందని వారికి హితబోధ చేశారు. ఆమె వెంట ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :