Thursday, 16 April 2026 08:27:05 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మహతి ఫార్మసీ కళాశాల న్యాక్ గ్రేడ్ తో పాటు అటానామాస్ గుర్తింపు రద్దు చేయాలి - AISF

Date : 08 July 2025 08:42 PM Views : 337

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి - జులై 08 : మహతి ఫార్మసీ కళాశాల న్యాక్ "A గ్రేడ్" మరియు అటానమస్ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి – AISF మహతి ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న ఆర్ధిక అరాచకాలు, విద్యార్థులపై అధిక ఫీజుల భారం, అక్రమ వసూళ్లు, మరియు మానసిక ఒత్తిడి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. విద్యారంగాన్ని వ్యాపారంగా మలచిన ఈ సంస్థ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈ సంద్భంగా AISF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు మాట్లాడుతూ “విద్యను వ్యాపారంగా మలచి విద్యార్థుల పట్ల అన్యాయం చేస్తున్న మహతి ఫార్మసీ కళాశాలపై ప్రభుత్వం చర్య తీసుకోవాలి. విద్యార్థుల నుంచి అటానమస్ అనే ట్యాగ్ తగిలించుకొని అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ, మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. అలాగే విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఇది పూర్తిగా న్యాయ విరుద్ధం. న్యాక్ A గ్రేడ్ అనే గుర్తింపు ఈ కళాశాలకు ఉండటమే విద్యా వ్యవస్థపై అపహాస్యంగా మారింది. ఈ సంస్థకు ఇచ్చిన అటానమస్ గుర్తింపును కూడా వెంటనే రద్దు చేయాలిని AISF గా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము – కాబట్టి వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సంఘటితంగా ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. విద్యార్థుల భవిష్యత్తు కోసం, అసలు విద్యా విలువలను కాపాడేందుకు న్యాయం కోసం మేము పోరాటం కొనసాగిస్తాం అని వారు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ కో కన్వీనర్లు గంగరాని, భవిత, నియోజకవర్గ నాయకులు సాయికిరణ్, రెడ్డి నవదీప్ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :