Wednesday, 16 September 2026 12:54:42 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

దౌర్జన్యంగా మా విలువైన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు

ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి బాధితురాలు అమరావతి ఫిర్యాదు

Date : 19 January 2026 07:33 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దౌర్జన్యంగా మా విలువైన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి బాధితురాలు అమరావతి ఫిర్యాదు మదనపల్లె : దౌర్జన్యంగా తమ విలువైన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని మదనపల్లె మండలం,వేంపల్లె పంచాయతీ,బండకాడపల్లెకి చెందిన పొన్న సహదేవ భార్య పొన్న అమరావతి పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నందు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అమరావతి మాట్లాడుతూ ఏప్రిల్ 25,2011వ తేదీన పొన్నిటీపాళ్యం పంచాయతీ సర్వే నెంబర్ 10-1,11-1లో ప్లాట్ నెంబర్ (4) 229.77 చదరపు గజాల స్థలాన్ని మంత్రి ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నుండి కొనుగోలు చేశామన్నారు.అయితే ఇటీవల కాలంలో మా పక్క స్థలం యజమానులు బుక్యా శ్రీనివాసులు నాయక్ ఆయన కుమారులు బి.ఉమామహేశ్వర నాయక్ (సర్వేయర్),బాలు నాయక్ అనువారు తాము ఇంటి నిర్మాణం చేసుకోవాలని,మీ స్థలంలో ఇంటి నిర్మాణ సామాగ్రిని నిలువ చేసుకుంటామని కోరగా తాము అంగీకరించామన్నారు.వారు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారని,ఇదే అదునుగా భావించి మా స్థలాన్ని ఖాళీ చేయకుండా ఇసుకను నిలువ ఉంచుకుంటున్నారన్నారు.మా స్థలంలో ఇసుకను ఖాళీ చేసి శుభ్రం చేయాలని వారిని కోరగా దుర్భాషలాడుతూ దాడులకు ప్రయత్నించారన్నారు.అంతేకాకుండా మా స్థలంలోకి వారి అనుచరులను తీసుకువచ్చి మమ్మల్ని ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారన్నారు.ఆ స్థలం తాము నిర్ణయించిన ధరకు విక్రయించి వెళ్లిపోవాలని లేనియెడల మీపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉమామహేశ్వర నాయక్ (సర్వేయర్) రెవెన్యూ రికార్డులు ఎలా తారుమారు చేయాలో తనకు తెలుసునని,నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకోండని,మాకు రాజకీయ నాయకుల అండ ఉందని హెచ్చరిస్తున్నారని వాపోయారు.మా స్థలంలో తరచూ మద్యం సేవిస్తూ టెంట్లు వేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు.శ్రీనివాసులు నాయక్ వారి అనుచరుల నుండి మాకు ప్రాణహాని ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకుని,మా స్థలాన్ని వారి ఆశ్రమం నుండి కాపాడి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :