Wednesday, 16 September 2026 12:47:09 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్

ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొంటాము -జాయింట్ కలెక్టర్

Date : 15 September 2026 07:24 PM Views : 6

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలి - నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో జెసికి వినతి మదనపల్లె : మండలం బొమ్మనచెరువు గ్రామానికి సంబంధించిన 10 పోలింగ్ కేంద్రాలను బొమ్మనచెరువులోని ఒకే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయకర్త ఎస్.నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు.ఈ మేరకు మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో జెసిని కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ బొమ్మనచెరువు ప్రభుత్వ పాఠశాలలో ఒకేసారి 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఎన్నికల రోజున ఓటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని,సదరు పాఠశాలకు ఒకే చిన్న ప్రవేశ ద్వారం ఉండటం,అది కూడా ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో,10 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్లు ఒకేసారి పెద్ద సంఖ్యలో తరలివస్తే ట్రాఫిక్ సమస్యలు,వాహనాల రాకపోకలకు అంతరాయం,ప్రజల తొక్కిసలాట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని,ముఖ్యంగా వృద్ధులు,మహిళలు,దివ్యాంగులు మరియు ఇతర ఓటర్లు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.అదేవిధంగా బొమ్మనచెరువుకు సమీపంలోని పలు గ్రామాల ప్రజలకు మందబండ గ్రామం మరింత అనుకూలమైన ప్రదేశంగా ఉంటుందని వివరించారు.అక్కడ ఇప్పటికే అదనపు పాఠశాల భవనం,స్వర్ణ గ్రామం భవనం (గ్రామ సచివాలయం),రైతు భరోసా కేంద్రం వంటి ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని నిసార్ అహ్మద్ చెప్పారు.అనంతరం మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా మందబండలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినందున,అక్కడ 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని,అందువల్ల బొమ్మనచెరువు ప్రభుత్వ పాఠశాలలో 5 పోలింగ్ కేంద్రాలను కొనసాగించి,మిగిలిన 5 పోలింగ్ కేంద్రాలను మందబండ గ్రామంలో ఏర్పాటు చేయాలని ఆయన జేసిని కోరారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ్ శర్మ సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని,ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంటామని స్పందించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా,పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ప్రజల సౌకర్యం,భద్రత,రవాణా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు యూనస్,గ్రానైట్ మహేశ్,నవాజ్ అలీ ఖాన్,సాధిక్,షేక్ జబి,యాసిన్,బొమ్మనచెరువు గ్రామస్తులు,ఎంపిటీసి కదిరిపతి,రమణ,ఎల్లుట్ల గణేష్,పి.అమర తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :