నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 15 :: తంబళ్లపల్లె మండలంలోని వెలుగు మహిళా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 16 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు ఈనెల 25వ తేదీ లోపు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎండి మంజూర్ ఇలాహి తెలిపారు. మంగళవారం తెలుగు ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు రుణాల పంపిణీకి మహిళా సంఘాల లో చైతన్యం నింపి సహకరించాలని కోరారు. రుణాల పంపిణీ లో ఏపీ ఎంతో పాటు సీసీలు, సంఘ మిత్రులు, వివో సభ్యుల సహకారం మరువలేమని కొనియాడారు. ఏపీఎం మాట్లాడుతూ ఇప్పటికే 2.30 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు మహిళలకు అందించామని త్వరలో మహిళా సంఘాలకు రుణాలు అందించి వారి ఆర్థిక పురోభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు పాడియావులు, చిన్న వ్యాపారాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి సహకరిస్తామన్నారు. ఈ సమీక్షలో సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News