Saturday, 12 September 2026 01:52:35 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

6వ రోజూ ప్రజా సమస్యలపై కొనసాగిన సిపిఐ పాదయాత్ర

Date : 11 August 2026 08:20 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఆగస్ట్ 11 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బి.కొత్తకోట నగరంలోని ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర ఆరవ రోజు మంగళవారం కొనసాగింది.ఉదయం 9:30 గంటలకు ప్రారంభించిన పాదయాత్ర పట్టణంలోని దర్గావీధులు,సింహంవీధి సంతబజార్,పాశంవీధి,వైశ్య బజార్,హరి మందిరంవీధి,పోకనాటి వీధి,SCకాలనీ,తిరుమల వీధి,కరెంటు కాలనీ తదితర పురవీధులలో పట్టణంలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి చేరవేస్తూ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎదగడుతూ,ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రతివీదిలోనూ పలు సమస్యలను ప్రజలు పాదయాత్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్.బషీర్ ఖాన్,పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్అల్లి లు మాట్లాడుతూ; పట్టణంలో పలు ప్రజా సమస్యలు తమ దృష్టికి వచ్చినాయని,వీటన్నింటి పరిష్కారం కోసం ఈ నెల 17వ తేదీన నగర పంచాయతీ కార్యాలయం ఎదుట "ధర్నా" కార్యక్రమం నిర్వహించి తమ దృష్టికి వచ్చిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు సమర్పిస్తామని,బి.కొత్తకోట పట్టణ సమగ్రాభివృద్ధి కోసం సిపిఐ ఆధ్వర్యంలో అంచెలంచలుగా పోరాటాలు కొనసాగిస్తామని, ప్రజానీకం అందరూ కూడా ఈ పోరాటాలలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు హెచ్.షమీవుల్లా యస్.హబీబ్,ఎం.గంగులప్ప,పి.రామచంద్ర,దుమ్ము బాబు,ఎస్.ఖాదర్ బాషా,షాకీర్,మస్తాన్,షఫీ,కాటమరాయుడు,బాబాజాన్,గంగులప్ప,రియాజ్,శ్రీరాములు,పి.నర్సింహులు,పి.గంగాద్రి,అంజి,వెంకటరమణ,వెంకటప్ప,పిటిఎంఅంజన్న,భాస్కర తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :