నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 07 : అంగళ్ళు సమీపం లో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మేధో సంపత్తి హక్కుల పై అవగాహన సదస్సు మరియు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSMEs) ప్రభుత్వ నిధుల పథకాలపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సృజనాత్మక రచనలను రక్షించడం మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధకులు మరియు పరిశ్రమ నిపుణులను శక్తివంతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఇన్నోవేటివ్ స్కీమ్‌లోని మేధో సంపత్తి హక్కుల భాగం కింద మిట్స్ మేధో సంపత్తి ఫెసిలిటేషన్ సెంటర్ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. “ఐ.పి.ఆర్ అవగాహన మరియు అన్ని రకాల పరిశ్రమలకు ప్రభుత్వ నిధుల పథకాలు” అనే అంశంపై న్యూఢిల్లీకి చెందిన భారత ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సతీష్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఆవిష్కరణలు, సంప్రదాయ జ్ఞానం, బ్రాండ్ గుర్తింపును రక్షించడంలో ఇంటెలెక్ట్యువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రాధాన్యతను వివరించడంతో పాటు ఆర్థిక సహాయం, సాంకేతిక అభివృద్ధి మరియు సదుపాయాలకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం “అన్నమయ్య జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు” అనే అంశంపై జిల్లా పరిశ్రమల అధికారి కె. కృష్ణ కిషోర్ మాట్లాడుతూ, జిల్లాలోని పారిశ్రామిక సామర్థ్యం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, చిన్న తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలు, జిల్లా స్థాయి ప్రోత్సాహకాలు మరియు పరిశ్రమల శాఖ ద్వారా అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై వివరించారు. ఈ వర్క్‌షాప్ భౌగోళిక సూచికలు, ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్‌లు మరియు పేటెంట్‌లతో సహా మేధో సంపత్తి హక్కుల (IPR) యొక్క కీలకమైన అంశాల పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జే.యెన్.టి.యు కలికిరి, ఐ.పి.ఆర్ కోఆర్డినేటర్ డాక్టర్ కే.అరుణ, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, కన్వీనర్ మరియు అడ్వైసర్ ఆర్&డి డాక్టర్ తులసీరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ ఆర్&డి డాక్టర్ శివయ్య, అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, ఎమ్ ఎస్ ఎమ్ ఈ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News