Saturday, 12 September 2026 04:41:11 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మిట్స్ యూనివర్సిటీ లో సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణం లో మెలుకువల పై అవగాహనా కార్యక్రమం

అల్యూమిని వెల్ఫేర్ అసోసియేషన్ & అమెరికన్ సివిల్ ఇంజినీర్ సొసైటీ ఆధ్వర్యంలో

Date : 22 December 2025 04:24 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 22 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగము వారు మిట్స్ అల్యూమిని వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆమెరికన్ సొసైటీ సివిల్ ఇంజనీర్స్ (ASCE) మిట్స్ స్టూడెంట్స్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో అధునాతన సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణ పద్దతులపై మూడు రోజుల అవగాహనా వర్కుషాప్ ను ప్రారంభించారు.. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పూణే కి చెందిన హిల్టి టెక్నాలజీస్ కంపెనీ లో టెక్నికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కళాశాల పూర్వ విద్యార్ధి పి.కార్తీక్ పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సివిల్ ఇంజనీరింగ్ యొక్క పాత్ర ఎనలేనిదని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శాస్త్రీయంగా రూపకల్పన చేయబడిన నిర్మాణాలు, వంతెనలు, రహదారులు, నీటి పారుదల వ్యవస్థలు, పట్టణ ప్రణాళిక – ఇవన్నీ సివిల్ ఇంజనీరింగ్ రంగానికి చెందినవన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సివిల్ ఇంజనీర్లు భవిష్యత్తు అవసరాలను తీర్చగల మౌలిక నిర్మాణాలను రూపొందిస్తున్నారు అని, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (BIM) వంటి నూతన సాంకేతికతలు సివిల్ ఇంజనీరింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చాయన్నారు. ప్రస్తుత ఆధునిక నిర్మాణ రంగంలో హిల్టి (Hilti) ప్రోఫిస్ ఇంజినీరింగ్ సూట్ అనేది నిర్మాణ ఇంజినీర్ల కోసం రూపొందించబడిన ఆధునిక ఇంటర్నెట్ ఆధారిత కంప్యూటింగ్ సేవల సమాహార ఆధారిత సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్మాణాలకు సంబంధించిన బేస్ ప్లేట్లు మరియు స్టీల్ కనెక్షన్ల రూపకల్పన (డిజైన్) మరియు విశ్లేషణను సులభంగా, ఖచ్చితంగా చేయవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుండైనా ఉపయోగించుకునే సౌకర్యం ఉండటం వల్ల ఇంజినీర్లు తమ పనిని వేగంగా మరియు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతున్నారు. నిర్మాణ భద్రతను పెంపొందించడంలో, డిజైన్ లోపాలను తగ్గించడంలో హిల్టి ప్రోఫిస్ ఇంజినీరింగ్ సూట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ఆధునిక నిర్మాణ అవసరాలకు అనుగుణంగా ఇంజినీర్లకు నమ్మకమైన డిజైన్ పరిష్కారాలను అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగం మీదే ఆధారపడకుండా నిర్మాణ రంగంలోని ఉద్యోగాలలో కూడా రాణించవచ్చని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎన్.విజయ్ కుమార్, డీన్-స్కూల్ అఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగాశ్వేత, కోఆర్డినేటర్ కె. అనిత, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :