నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - నవంబర్ 14 : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట లో 2019 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి గా చేస్తూ స్థాయిని పెంచుతూ కమ్యూనిటీ ఆసుపత్రి ని చేశారు. సి.హెచ్.సి. చేసినా కూడా మదనపల్లి కి రెఫెర్ చేసే పరిస్థితే ఎక్కువ. డాక్టర్లు బాగానే ఉన్నా దానికి తగ్గట్టు మిషనరీ ఎక్యుప్మెంట్ లేకపోవడంతో మదనపల్లి కి రెఫెర్ చేస్తున్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే పెద్దెరెడ్డి ద్వారాకానాథ్ రెడ్డి, ఎంపీ మిథునరెడ్డి కృషి ఫలితంగా 70 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినా దానిని మెయింటెనెన్స్ చేయడానికి టెక్నీషన్ లేరు అధికాస్త మూలనపడింది అత్యవసరం అయితే మదనపల్లె కు పోవాల్సివస్తుంది ఇంత పెద్ద ఆసుపత్రికి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మొర్చురీ రూమ్ లేక 40 కిలోమీటర్ల దూరం లోని మదనపల్లి కి పోవాలి. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు చనిపోయిన బాధలో వున్నా 10 వేలు చెల్లించి ప్రయివేటు అంబులెన్స్ లో తీసుకొనిరావాల్సిన పరిస్థితి. పేద వారిని దృష్టిలో ఉంచుకొని నివారించేందుకు కృషి చేయాలని వాపోతున్న స్థానికులు.
Reporter
Namitha News