నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 23 : అంగళ్ళు సమీపం లో నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఆశ్వ్ 2k26 జాతీయ స్థాయి టెక్నో - కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా స్పోర్ట్స్ ను యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం రోజున ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా లెక్కల హితేష్ రావు, నేషనల్ హాకీ ప్లేయర్ పాల్గొన్నారు. ముందుగా మిట్స్ యూనివర్సిటీ ప్రో ఛాన్సల్లర్ నాదెళ్ల ద్వారకానాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాషా జ్యోతి ప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమం లో హితేష్ రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, దేశ నిర్మాణంలో క్రీడల ప్రాముఖ్యత గురుంచి తెలియజేశారు. క్రీడల్లో రాణించాలంటే ఓపిక, ధైర్యం, నిబద్ధత అవసరమని, గెలుపు కోసం కొన్నిసార్లు సంవత్సరాల పాటు కష్టపడాల్సి ఉంటుందని, అందుకు మనోధైర్యం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే ప్రతి క్రీడాకారుడు నిరంతర శ్రమతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్రీడల వల్ల విద్యార్థుల కు జీవితాలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అని, క్రీడల వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆరోగ్యకరంగా మనము ఎదగాలని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు స్పోర్ట్స్ ఉపయోగపడతాయి అని ఆయన అన్నారు. కార్యక్రమంలో నాదెళ్ళ ద్వారకానాథ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లో భాగంగా క్రికెట్, వాలీబాల్ , కబ్బడి మరియు ఇతర పోటీలను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన అన్నారు. వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన క్రీడాకారులను అభినందిస్తూ, గెలుపు-ఓటములు సహజమని, ఓటమితో నిరుత్సాహపడకుండా నిరంతరం కృషి చేస్తే విజయం సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ వై ప్రదీప్ కుమార్, శ్రీ లక్ష్మి ప్రీతీ, ఫీజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News