Monday, 14 September 2026 05:26:30 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

గోపిదిన్నె లో వైభవంగా హిందూ సమ్మేళనం

Date : 28 December 2025 10:10 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 28 : తంబళ్లపల్లె మండలం గోపి దిన్నె కొత్తపల్లి బస్ స్టాప్ లోని అభయ ఆంజనేయ ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల వారోత్సవ హిందూ సమ్మేళన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రతినిధి గంగారపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హిందూ మతంలో సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి హిందువు బాధ్యతగా భావించాలన్నారు. నేడు హిందూ సమాజం ఇతర మతాలకు తరలి వెళ్లకుండా మన సంస్కృతి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. నేటి తరం యువతకు సైతం మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు తో పాటు దైవచింతన, ఆధ్యాత్మికత, దేవుని ఆరాధించడం అలవాటుగా మార్చాలని హితవు పలికారు. హిందూ బంధువులు అలనాటి పురాతన కళలు కోలాటాలు, చెక్కభజనలు ప్రదర్శించే కళాకారులను ప్రోత్సహించి గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా భక్తులు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భజన గురువు ప్రభాకర్ రెడ్డి, మహిళా కళాకారిణి లక్ష్మీనరసమ్మ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందూ బంధువులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :