Tuesday, 15 September 2026 08:51:51 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ప్రకృతి వ్యవసాయం తో రైతులకు స్వర్ణయోగం - జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ

Date : 28 November 2025 07:34 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 28 : రసాయన ఎరువుల పంటల తో అనారోగ్యంతో పాటు పర్యావరణం కాలుష్యం దృశ్య భవిష్యత్తులో రైతులు ప్రకృతి వ్యవసాయంతో స్వర్ణ యుగం సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కోటకొండ, కుక్క రాజు పల్లి పంచాయితీలో రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రి టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుండి మద్దతు ఈ అంశాలతో ముందుకు వస్తున్నట్టు చెప్పారు. ప్రతి రైతు రాబోయే ఐదేళ్లలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి ద్వారా పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ డిపిఎం వెంకట మోహన్ ప్రకృతి వ్యవసాయం భావితరాలకు వారసత్వంగా రావాలని నేడు ప్రకృతి ఆధారిత పంటలు రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా క్రిమిసంహారక మందులు వాడటం తగ్గించి ఆవు మూత్రం, పేడ, వేపాకు కషాయాలతో పంటల సస్య రక్షణ చేపట్టాలని తెలిపారు. మండల పశువైద్యాధికారి విక్రం రెడ్డి పాడి పెంపకం, పాల ఉత్పత్తి, పశుగ్రాసం, నిరోధక టీకాలు, గోకులాలు, కోళ్ల పెంపకం పలు సూచనలు చేశారు.ఎఓ రమణ కుమార్ మాట్లాడుతూ రైతులు రైతన్న మీకోసం కార్యక్రమాల ద్వారా వ్యవసాయం, పశు వైద్యం పై అవగాహన పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ అధికారులు సురేష్, సుధాకర్, రెడ్డి శేఖర్, శిరీష, రత్నమాలిక, రైతులు నాగరత్నమ్మ , చిన్నపరెడ్డి , గాలి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :