Wednesday, 29 July 2026 08:34:11 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ విద్యార్థులకు వి.ఎల్.ఎస్.ఐ టెస్టింగ్ మరియు ఫిజికల్ డిజైన్ పై సెమినార్

Date : 25 February 2026 08:28 PM Views : 250

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి - ఫిబ్రవరి 25 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఐ.ఎస్.టి.ఈ. స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వి.ఎల్.ఎస్.ఐ (VLSI) టెస్టింగ్ మరియు ఫిజికల్ డిజైన్ రంగాల్లో జరుగుతున్న ఆధునిక సాంకేతికతలు అనే అంశంపై విద్యార్థులకు ఒక్క రోజు సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖపట్నానికి చెందిన సిలిక్వాన్ టెక్నాలజీ సంస్థ ఫౌండర్ అండ్ సి ఈ ఓ డాక్టర్ అష్రఫ్ అలీ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వి.ఎల్.ఎస్.ఐ (వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్) ఎలక్ట్రానిక్ చిప్ ల తయారీలో ఫిజికల్ డిజైన్ అనగా లాజికల్‌గా రూపొందించిన సర్క్యూట్ నమూనా తయారీను నిజమైన చిప్ (IC) రూపంలో అమలు చేసే ప్రక్రియ అని అన్నారు. ఐసీ తయారీలో నాలుగు ప్రధాన దశలు ఉంటాయని సెమీకండక్టర్ చిప్‌లు (ICలు) తయారు చేయడానికి ఉపయోగించే సిలికాన్ పలకను, వేఫర్ తయారీ, నమూనా తయారీ, పరీక్షించడం వంటి వాటిని వివరించి, రెసిస్టర్లు, కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు వంటి భాగాలను ఒకే చిన్న చిప్‌లో సమగ్రపరచి సిగ్నల్స్‌ను పంపించే విధానాన్ని వివరించారు. అలాగే టెస్టింగ్ విభాగంలో చిప్ పనితీరును పరీక్షించడం, లోపాలను గుర్తించడం, నాణ్యతను నిర్ధారించడం వంటి అంశాలను వివరించారు. వి.ఎల్.ఎస్.ఐ చిప్ తయారీ రంగంలో పరీక్షించడానికి మరియు విశ్లేషించడానికి ఉపయోగించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాధనాలు అయిన సినాప్సిస్ (Synopsys), కాడెన్స్ (Cadence) వంటి వాటిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అమెరికా, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ మరియు ఇండియా వంటి దేశాల్లో అంతర్జాతీయ సంస్థలు అయిన ఇంటెల్ , క్వాల్కామ్ వంటి కంపెనీలలో ఫిజికల్ డిజైన్ ఇంజనీర్, వెరిఫికేషన్ ఇంజనీర్, చిప్ టెస్టింగ్ ఇంజనీర్ మరియు నమూనా తయారీ ఇంజనీర్ వంటి అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని, విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి. గౌర్, డాక్టర్ ఎస్ రాజశేఖరన్, కోఆర్డినేటర్ డాక్టర్ జి. నాగజ్యోతి, కో-కోఆర్డినేటర్ జి. చరణ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: