Monday, 14 September 2026 09:50:59 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నిద్రలో ఉన్న భర్త చెవిలో విషం పోసిన భార్య..!

Date : 03 July 2026 12:33 PM Views : 373

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తమిళనాడు: భర్తను చనిపోతే రుణదాతల ఒత్తిళ్ల నుంచి బైటపడవచ్చని భావించిన ఓ మహిళ కట్టుకున్న వాడినే లేపేసేందుకు స్కెచ్‌ వేసింది. అతడి చెవిలో విషం పోసింది.వివరాలు.. తంజావూరు జిల్లా, తిరువిడైమరుదూర్‌ తాలూకాలోని పుళుదికుడికి చెందిన కూలీ రవిచంద్రన్‌ (54), ఉమారాణి (48)ని 27 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కుమారుడు విదేశాలలో పని చేస్తుండగా, కుమార్తెకు పెళ్లైంది. రవిచంద్రన్‌ కొత్తగా ఇంటి నిర్మాణం కోసం మీద పాలారి-డ్యామ్, ఇతర గ్రూపుల నుంచి రూ.10లక్షల రుణం పొందాడు. దీనిని చెల్లించలేకపోవడంతో తరచూ దంపతులు మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో తన భర్త చనిపోతే రుణం తీర్చాల్సిన ఒత్తిడి ఉండదని భావించిన ఉమారాణి, తన తమ్ముడు జ్ఞానశేఖరన్‌ (35)తో కలిసి భర్తను చంపేందుకు స్కెచ్‌ వేసింది. మంగళవారం రాత్రి రవిచంద్రన్‌ నిద్రిస్తున్న సమయంలో అతడి చెవిలో వారిద్దరూ విషం పోశారు. మేల్కొన్న రవిచంద్రన్‌ వారి నుంచి తప్పించుకుని స్థానికుల సాయంతో కుంభకోణం ఆస్పత్రిలో చేరాడు.అతని ఫిర్యాదు ఆధారంగా, తిరువిడైమరదూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఉమారాణి, జ్ఞానశేఖర్‌ను అరెస్టు చేశారు. ప్రాధమిక విచారణలో మూడు నెలల క్రితమే ఆ ఇద్దరూ టీ లో విషం కలిపి అతన్ని చంపడానికి ప్రయత్నించారని, ఆ ఘటన నుంచి తప్పించుకున్న రవిచంద్రన్, అప్పటి నుంచి ఇంట్లో ఏమీ తినకుండా జాగ్రత్త పడుతున్నాడని తేలింది. ఈ క్రమంలో చెవిలో విషం పోసినట్లు నిర్ధారైణెంది. నిందితులిద్దరినీ కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌ నిమిత్తం తంజావూరు జైలుకు తరలించారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :