నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 08 : తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు సమీపంలోని బీసీ గురుకుల పాఠశాలను జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి అమర్నాథరెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా విధానంపై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టుకుని విద్యార్థులు విద్యలో పోటీ తత్వం పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడి చదివి సత్ఫలితాలు సాధించడానికి కృషి చేయాలన్నారు. అధ్యాపకులు విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విద్య అభ్యసించడానికి సరళమైన మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. విద్యార్థుల విద్యతోపాటు క్రీడలు వల్ల మానసిక ఉల్లాసం, అభ్యసన స్థాయి పెంచుకోవాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసి ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, వంట నిర్వాహకులను ప్రశంసించారు
Reporter
Namitha News