నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - డ్రోన్ కెమెరాలకు 11 మంది కోడిపందెగాళ్లు అరెస్ట్ మదనపల్లె : అన్నమయ్య జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతోంది.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ పోలీసులు నేరాలకు చెక్ పెడుతున్నారు.ఇందులో భాగంగా మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా పక్కాగా నిఘా ఉంచారు.గత జులై 28వ తేదీన మదనపల్లె మండలం,వలసపల్లె పంచాయతీ పరిధిలోని బోగిటివారిపల్లె వద్ద బహిరంగ ప్రదేశంలో అక్రమంగా కోడిపందేలు ఆడుతున్న 11 మందిని డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు.నిందితులపై ఏపీ గేమింగ్ యాక్ట్-1974 కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.ఈ కేసును విచారించిన మదనపల్లె సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రమేష్,పోలీసుల సాక్ష్యాధారాలను పరిశీలించి నేరం రుజువు కావడంతో పట్టుబడిన 11 మంది నిందితులకు 10 రోజులపాటు జైలుశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చారు.ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ ఆపరేషన్ ని విజయవంతంగా నిర్వహించడమే కాకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించి నిందితులకు శిక్ష పడేలా చేసిన మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ,ఎస్ఐలు విష్ణు నారాయణ,రామకృష్ణారెడ్డి,డ్రోన్ సర్వేలెన్స్ సిబ్బంది మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేకంగా అభినందించారు.జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని,వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.
Reporter
Namitha News