నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 07 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో శుక్రవారం చేనేత సంఘం అధ్యక్షుడు రేపన మల్లికార్జున ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు. కూటమి ప్రభుత్వం అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న సేవలో నేతన్న భరోసా పంపిణీ చేయాలని అచ్చు మహిళా కార్మికులు, వైన్డింగ్, కలర్, డిజైన్, జాకార్డ్ కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం తోపాటు నేతన్న భరోసా పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పురుషోత్తం, నరసింహులు,వీరాంజనేయులు, కార్మికులు రవికుమార్, నాగార్జున, నరసింహులు, వెంకటరమణ, మురళీకృష్ణ, భూపతి, అశోక్ కుమార్, మధుకర్ రెడ్డి, రాజా రమేష్, జయరాం, నరసింహారెడ్డి, శివశంకర్, ప్రభాకర్, నరేష్, మౌలాలి, రెడ్డి ప్రసాద్, శంకర్, సుధాకర్, చంద్రశేఖర్, రాజశేఖర్ రెడ్డి, సాంబశివ, వెంకటరమణ కూటమి నేతలు పాల్గొన్నారు
Reporter
Namitha News