Wednesday, 29 July 2026 04:55:49 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

అనంతపురం పాదయాత్ర గోడపత్రికలను ఆవిష్కరించిన సీపీఐ, బీకేఎంయూ నాయకులు

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్న NDA ప్రభుత్వం

Date : 05 April 2026 04:41 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 05 : అనంతపురం పాదయాత్ర గోడపత్రికలను ఆవిష్కరించిన సీపీఐ, బీకేఎంయూ నాయకులు గతంలోనున్న ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ఈ నెల 10 నుంచి 12 వరకు అనంతపురం నుంచి నార్పల నుండీ బండ్లపల్లి వరకు సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో నిర్వహించే పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి. కృష్ణప్ప పిలుపునిచ్చారు. స్థానిక పిటిఎం రోడ్డు నందు పాదయాత్రలకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి.కృష్ణప్ప,సిపిఐ నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి లు మాట్లాడుతూ;ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని,కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక కుట్రలు చేస్తుందన్నదని విమర్శించారు.యూపీఏ వన్ ప్రభుత్వంలో వామపక్ష పార్టీల ఎంపీల మద్దతుతో ఈ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని,2005లో అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఉపాధి చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల వ్యవసాయ కూలీలు,కష్టజీవులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు.కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించి మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వంపై మోపడం అన్యాయమన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారంతో సతమతమవుతున్నాయని,ఇలాంటి తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం వ్యవసాయ కూలీలకు అన్యాయం చేయడమే తప్ప మరొకటి కాదన్నారు.కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న చంద్రబాబు నాయుడు ఈ పథకం నిర్వీర్యం అవుతున్నప్పటికీ వ్యవసాయ కూలీలకు, కష్టజీవులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పటికీ కనీసం మాట్లాడకపోవడం బాధాకరమన్నారు.కేంద్రం అనుసరిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్10-12 తేదీలలో అనంతపురం నుంచి బండ్లపల్లి వరకు పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా,జాతీయ నాయకులు కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల.ఈశ్వరయ్య, బికెఎంయు జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా,ఇంకా అనేక సిపిఐ ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారని పార్టీ కార్యకర్తలు కష్టజీవులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జి. రఘునాథ్,పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్ అల్లి, ఎఐటియుసీ మండల అధ్యక్షులు ఎస్.తంబయ్య శెట్టి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి.నారాయణస్వామి, బీసీ కాలనీ శాఖ కార్యదర్శి పి.మంజునాథ్, దుమ్ము.బాబు,హబీబ్ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :