Saturday, 12 September 2026 04:43:34 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

తంబళ్లపల్లి టిడిపిలో నిఖార్సయిన పసుపు సైనికుడు సుదర్శన్ రెడ్డి

క్రమశిక్షణ,విధేయత కలిగిన నాయకుడిగా గుర్తింపు పార్టీకి నిస్వార్ధంగా సేవలు అందించడం ఆయన నైజం వైఎస్సార్సీపి అరాచకాలపై అలుపెరుగని పోరాటం పార్టీలో సమర్థవంత

Date : 14 November 2025 11:55 AM Views : 395

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నవంబర్: 14 పరిస్థితులను బట్టి పార్టీలు మారుతున్న నాయకులు ఉన్న ప్రస్తుత రాజకీయాలలో సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి పార్టీ కోసం నిస్వార్ధమైన సేవలు అందించే నాయకులు,కార్యకర్తలు చాలా అరుదు.అలాంటి వారి కోవలోకే వస్తారు తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోట మండలం,గట్టు పంచాయతీకి చెందిన తెలుగు యువత రాజంపేట పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు టి.సుదర్శన్ రెడ్డి.పార్టీలో నిజాయితీగా పనిచేస్తూ అనతి కాలంలోనే అధిష్టానం దృష్టిని ఆకర్షించారు.పదవుల కన్నా పార్టీ అధికారమే ముఖ్యమనే సంకల్పంతో పనిచేసిన పసుపు సైనికుడు. తంబళ్లపల్లి టిడిపిలో నిఖార్సయిన పసుపు సైనికుడు తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీలో నిఖార్సయిన పసుపు సైనికుడిగా సుదర్శన్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు.స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావుపై ఉన్న అభిమానంతో 2009 నుండి టిడిపి కార్యక్రమాలలో సుదర్శన్ రెడ్డి చురుకుగా పాల్గొంటున్నారు.సుదర్శన్ రెడ్డి కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉంది.దీంతో పార్టీ అధిష్టానం ఆయనకు అప్పట్లో చిత్తూరు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించింది.2009లో ఎన్నికలలో ప్రవీణ్ కుమార్ రెడ్డి,2014 శాసనసభ ఎన్నికలలో జి.శంకర్ యాదవ్ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో నిర్విరామ కృషి చేశారు.అనుకోకుండా ప్రవీణ్ కుమార్ రెడ్డిని పార్టీని వీడడంతో బి.కొత్తకోటలో అప్పటి చిత్తూరు జిల్లా టిడిపి ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి సొంత ఖర్చులతో నియోజకవర్గం అంతటా పెద్దఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేసిన ఘనత తనకే దక్కుతుంది.2013లో జెడ్పిటిసిగా పోటీ చేశారు.అదే సంవత్సరంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులకు ఆర్థిక సాయం అందజేశారు.ఐదేళ్లపాటు అప్పటి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సహాయ సహకారాలతో బి.కొత్తకోట మండల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చిన తాను అండగా నిలిచేవాడు.పార్టీలో వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రస్తుతం రాజంపేట పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.పార్టీ కోసం సర్వశక్తులు ఒడ్డి ఆయన పనిచేస్తున్నారు.విపత్కర పరిస్థితుల్లో సైతం పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నారు.అధిష్టానం సూచనలు మేరకు పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడు తంబళ్లపల్లి టిడిపికి వీర విధేయుడుగా టి.సుదర్శన్ రెడ్డి ప్రసిద్ధి గడించాడు.మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ గెలుపు కోసం పనిచేసి ఎమ్మెల్యేగా శంకరన్నకు ఐదేళ్లపాటు ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నారు.పార్టీని నమ్ముకున్న నాయకులకు ప్రాధాన్యత నివ్వాలని,నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపాలని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన ముందు వరుసలో ఉండేవారు.బి.కొత్తకోట మండల ప్రముఖ నాయకులతో కలిసి పార్టీ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ అరాచకాలపై అలుపెరగని పోరాటం 2019 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ప్రభంజనం సృష్టించిన వేళ తంబళ్లపల్లిలో సైతం టిడిపికి ఓటమి తప్పలేదు.పెద్దిరెడ్డి కుటుంబం ప్రోత్బలంతో ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు దాడులు,దౌర్జన్యాలకు తెర తీశారు.వారి అవినీతి,అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు మాజీ ఎమ్మెల్యే జి.శంకరతో కలిసి ఆలుపెరగని పోరాటం చేశారు.పెద్దిరెడ్డి అరాచకాలకు భయపడి చాలామంది టీడీపీ నాయకులు కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు.పార్టీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని అక్కసుతో వైసిపి నాయకులు పోలీసులు అండతో 13 అక్రమ కేసులు ఆయనపై బనాయించారు.తన ఇంటిపై తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి కరుడుగట్టిన టిడిపి వాదిగా ముద్ర వేసుకున్నారు.అయితే సుదర్శన్ రెడ్డి తప్పుడు కేసులకు బెదరకుండా వారి ప్రలోభాలకు లోను కాకుండా ముందుకు సాగడం ఆయన ధైర్యానికి నిదర్శనం.అంతేకాకుండా 2021లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బలవంతంగా టిడిపి నామినేషన్లు వెనక్కి తీసుకునే విధంగా చూసి,ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నారు.అటువంటి పరిస్థితుల్లోనూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ,కొంతమంది టిడిపి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవడంలో మాజీ ఎమ్మెల్యే శంకన్నతోపాటు ఆయన విశేష కృషిచేశారు. పార్టీ అధిష్టానంతో ఆయనకు సత్సంబంధాలు పదవుల కన్నా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేసే అతి తక్కువ మంది నాయకులలో సుదర్శన్ రెడ్డి ఒకరని చెప్పడంలో అతిశయోక్తి లేదు.తాను తెలుగుదేశం పార్టీకి వచ్చిన తొలిరోజుల్లో అప్పటి సీనియర్ నాయకులైన గాలి మృదుకృష్ణమనాయుడు,బొజ్జల సుధీర్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారన్నారు.యువగళం పాదయాత్రలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ బాబు వెంట ఆయన నడవడంతోపాటు నియోజకవర్గమంతా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకున్నారు.అంతేకాకుండా పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించిన సొంత నిధులతో బ్యానర్లు ఏర్పాటు చేసి శభాష్ అని పించుకున్నారు.2024 ఎన్నికల్లో తంబళ్లపల్లి టిడిపి టికెట్ అధిష్టానం కొత్తవ్యక్తికి కేటాయించింది.పార్టీ ఆదేశాలను శిరసా పాటించి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు.ఇదే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు అద్దం పడుతుంది.దురదృష్టవశాత్తు నియోజకవర్గంలో టిడిపి ఓటమిపాలైంది.అయితే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు టిడిపి నాయకులతో కలిసి అందజేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు.తంబళ్లపల్లి టిడిపి బలోపేతానికి నిస్వార్ధంగా పనిచేస్తూ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు.పార్టీ ప్రముఖులతో ఆయనకు మంచి సంబంధాలు కలిగి ఉండడం ఆయనకు అదనపు బలం.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ బాబు పలు సందర్భాల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం ఉంటుందని తెలియజేస్తూ వస్తున్నారు.ఇప్పటికే పలు నామినేటెడ్ పదవుల భర్తీలో అది రుజువైంది.దీనిని బట్టి చూస్తే పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సుదర్శన్ రెడ్డికి అతి త్వరలోనే తంబళ్లపల్లి నియోజకవర్గం మంచి నామినేటెడ్ పదవి దక్కే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :