Tuesday, 15 September 2026 08:55:31 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు

Date : 05 June 2026 09:59 PM Views : 303

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 05 : రాష్ట్ర వైకాపా అధిష్టానం పిలుపుమేరకు శుక్రవారం తంబళ్లపల్లెలో చంద్రబాబు రెండేళ్ల పాలన వెన్నుపోటు కార్యక్రమానికి తంబళ్లపల్లె మండల కేంద్రంలో వైకాపాశ్రేణులు కదం తొక్కారు. ఉదయం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ సర్కిల్లో మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి సారధ్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి నాయకత్వాలు వర్ధిల్లాలి, నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆడబిడ్డ నిధి 1500, నిరుద్యోగులకు 3000 భృతి, బిసి, ఎస్సీ, ఎస్టీ లకు 50 ఏళ్లకే పెన్షన్ అట్టకెక్కించారని డీజిల్, పెట్రోల్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ పక్కదారి పట్టిందని విమర్శించారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని నేడు ప్రజలకు వెన్నుపోట్లు పొడిచారని దుయ్యబట్టారు. వైకాపా నాయకులు చంద్రబాబు వెన్నుపోట్లు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లయ్య కొండ మాజీ చైర్మన్ కేఆర్ మల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పి జె వెంకటరమణారెడ్డి, యువ నేత మల్లికార్జున రాయల్, మాజీ సర్పంచులు సుధాకర్ రెడ్డి, మౌలాలి, చెన్నకేశవరెడ్డి, రెడ్డి నారాయణ, భద్ర, ఎంపీటీసీలు కరీం, మహేష్, కరిముల్లా, రామకృష్ణ, రవీంద్ర నాయక్, జయ నారాయణరెడ్డి, రామ్మూర్తి, వెంకటేశ్వర్ రెడ్డి, కుమారమ్మ, వై వి సుబ్బారెడ్డి, షరీఫ్, రాణి గాని రాజారెడ్డి, చలపతి నాయుడు, అశోక్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నరసింహారెడ్డి, నరేందర్ రెడ్డి,రమేష్, శంకర్, బొట్టు శంకర్ రెడ్డి, రాజారెడ్డి, రెడ్డప్ప, లోకి, కేర్ అశోక్ రెడ్డి,మాధవరెడ్డి, శివకుమార్ రెడ్డి, రవీంద్ర, సలీం భాష, సాదిక్, రెడ్డప్ప రెడ్డి, మధుకర్, మహేష్, రవీంద్రనాయక్, సిద్ధమల్లు, వెంకటసుబ్బారెడ్డి, అప్పలనాయుడు, రాజేంద్ర, అంజి, విశ్వనాథ్, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :