Saturday, 12 September 2026 01:52:35 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

హాంద్రీ –నీవా జలాలతో చెరువులు నింపాలి, భూగర్భ జలాలను కాపాడి రైతాంగాన్ని ఆదుకోవాలి - రైతు నాయకుడు భీమగాని పద్మనాభరెడ్డి

నీటి తో చెర్వులు నిండితేనే రైతు కళ్లలో వెలుగులు

Date : 03 September 2026 07:28 PM Views : 53

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - సెప్టెంబర్ 03 : కరువు నేలల్లో రైతు బతకాలంటే సాగునీటి భరోసా కల్పించడమే శాశ్వత పరిష్కారమని రాష్ట్ర రైతు-కూలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భీమగాని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. గురువారం మదనపల్లి ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశం లో అయన మాట్లాడుతూ హాంద్రీ నీవా జలాలతో తంబళ్లపల్లి నియోజకవర్గం లోని చెరువులను నింపడంతో పాటు వర్షపు నీటిని సమర్థవంతంగా సంరక్షించి భూగర్భ జలాలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.‘రైతుకు కావాల్సింది కేవలం హామీలు కాదు.. పొలానికి నీరు. చెరువులో నీరు ఉంటే బోరులో నీరు ఉంటుంది.. బోరులో నీరు ఉంటే రైతు కళ్లలో వెలుగు ఉంటుంది’’ అని పేర్కొన్నారు. వర్షాలు పడినప్పుడు నీటిని ఒడిసిపట్టే విధంగా చెరువులు, కుంటలు, కాలువలను పునరుద్ధరించి ప్రతి నీటి చుక్కను భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలన్నారు. హాంద్రీ నీవా జలాలను చెరువులకు మళ్లించడం ద్వారా ఒకవైపు సాగునీటి సమస్య తగ్గడంతో పాటు మరోవైపు భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఏటా బోర్లు ఎండిపోవడం, వందల అడుగుల లోతుకు వెళ్లినా నీరు దొరకకపోవడంతో రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుల ఆక్రమణలను తొలగించి, పూడికతీత పనులు చేపట్టి, నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించాలని కోరారు. వ్యవసాయ సముదాయాల వారీగా చెరువులను గుర్తించి హాండ్రీ–నీవా నీటితో నింపేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘చెరువు నిండితే గ్రామం కళకళలాడుతుంది.. భూగర్భ జలాలు పెరిగితే రైతుకు భరోసా వస్తుంది. రైతు నిలబడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది’’ అని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మకు వినతి పత్రం అందజేశారు. హెచ్ఎఎన్ ఎస్ ఏస్ ఈ ని కలసి పరిస్థితిని వివరించారు. రైతులు రైతు కూలీల భవిష్యత్తు కోసం చేస్తున్న న్యాయమైన పోరాటానికి రైతులు రైతు సంఘాలు సహకరించాల్సిందిగా కోరారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: