Friday, 19 June 2026 03:22:00 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్

Date : 30 April 2026 04:29 PM Views : 167

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి లైసెన్స్ లేని మెడికల్ షాపులు వెంటనే సీజ్ చేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న మెడికల్ మాఫియా అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మదనపల్లిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టీ. కృష్ణప్ప, ఏరియా కార్యదర్శి పీ. మురళీ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అవసరం లేకున్నా టెస్టులు చేయించి వేల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో ఉన్న అన్ని మెడికల్ స్టోర్ల వివరాలు, లైసెన్సుల స్థితి, అనుమతి లేకుండా నడుస్తున్న దుకాణాలపై పూర్తి వివరాలతో జాబితా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వైద్య సేవలు, పరీక్షలు, ఔషధాలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను పట్టిక రూపంలో రూపొందించి ప్రతి ఆసుపత్రిలో ప్రదర్శించాలని కోరారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి దందాలకు పాల్పడుతున్న మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతిలేని అబార్షన్ మాత్రల విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లను తక్షణమే సీజ్ చేసి, అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాపులపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందకపోవడం ఆందోళనకరమని తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థో విభాగం ఉన్నప్పటికీ శస్త్రచికిత్సలు జరగకపోవడం, వైద్యులు ప్రైవేట్ క్లినిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమని విమర్శించారు. ఆసుపత్రిలో ఈఎన్టీ వైద్యుడిని నియమించి, తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె. మాధవ్, మునెప్ప, మునిరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :