Wednesday, 16 September 2026 01:57:38 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

మల్లయ్య కొండల్లో ఖనిజాల సర్వే మాత్రం చేస్తాం సహకరించండి - మైనింగ్ అధికారి సత్యనారాయణ

తంబళ్లపల్లె ను రెండో ఓబులాపురం చేయకండి - టిడిపి నాయకులు

Date : 04 June 2026 08:15 AM Views : 270

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 03 : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్లయ్య కొండల్లో కేవలం ఖనిజాల సర్వే మాత్రం నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ సహకరించాలని మైనింగ్ అధికారి సత్యనారాయణ నాయకులను కోరగా టిడిపి నాయకులు పవిత్రమైన మల్లయ్య కొండల్లో స్థానిక ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మైనింగ్ చేపట్టి తంబళ్లపల్లెను రెండో ఓబులాపురం చేయకండిని అధికారులను కోరారు. బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాసిల్దార్ శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి, మైనింగ్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో మల్లయ్య కొండ మైనింగ్ సర్వే పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మైనింగ్ అధికారి ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్లయ్య కొండల్లో ఖనిజాల అన్వేషణ కోసం సర్వే జరుపుతున్నామని మైనింగ్ ఇప్పట్లో చేపట్టమని అపోహలు నమ్మద్దని కేవలం సర్వే మాత్రమే జరుపుతామన్నారు. తాసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ తంబళ్లపల్లె అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే మల్లయ్య కొండల మైనింగ్, రెడ్డి కోట వద్ద పారిశ్రామిక వాడ,ద్వారా తంబళ్లపల్లె పారిశ్రామిక అభివృద్ధి తో పాటు మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కలిగి నిరుద్యోగ సమస్య తీరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సర్వేకు సహకరించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి మాట్లాడుతూ ప్రభుత్వం మల్లయ్య కొండల్లో ఖనిజాల సర్వే కి అనుమతి ఇచ్చిందని ఇందుకు మైనింగ్ అధికారుల ను అడ్డుకోరాదని అందరూ సహకరించి ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మల్లయ్య కొండ మాజీ చైర్మన్ గంగుల్ రెడ్డి లు మాట్లాడుతూ మైనింగ్ చేయమని సర్వే మాత్రం ఎందుకు చేయాలని మాకు అవసరం లేదని మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపడితే లక్షలాదిమంది ఆరాధ్య దైవం మహాశివుని భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆక్షేపించారు. గత కాంగ్రెస్ పాలనలో మేము ఓబులాపురం మైనింగ్ పర్యటనలో అక్కడి వారి దుర్భర పరిస్థితులు ప్రత్యక్షంగా అక్కడి రైతులు, ప్రజల పడుతున్న అవస్థలను చూసామని అలాంటి పరిస్థితి మా తంబళ్లపల్లె ప్రాంత ప్రజలకు రాకూడదని ఇందులో ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారని ఖరాఖండిగా చెప్పారు. పర్యావరణం పూర్తిగా నాశనమై పంటలు పండే పరిస్థితి లేదని, దుమ్ము ధూళి తప్ప ప్రజలు జీవించే పరిస్థితి లేదని అలాంటి దుర్గతి మా ప్రాంత ప్రజలకు వద్దని చెప్పారు. అధికారులు మరో మారు సబికులకు మల్లయ్య కొండ సర్వేపై సహకరించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అయితే హాజరైన సభ్యులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తామని మల్లయ్య కొండల్లో మైనింగ్ కు అప్పజెప్పరాదని తిరుగు ముఖం పట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అనిల్ కుమార్, రెవిన్యూ అధికారులు, టిడిపి నాయకులు కాలా నారాయణ, పురుషోత్తం, కసెట్టి వెంకటరమణ, సురేంద్ర, బాలరాజు, వీరాంజనేయులు, నరసింహులు, మధు నాయుడు, నరేంద్ర నాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: