Saturday, 12 September 2026 02:49:43 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

జిల్లా సమగ్రాభివృద్ధికి దృఢ ప్రణాళిక తో లక్ష్యం ను ఆదిగమించాలి - కలెక్టర్

పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి - పరిష్కారానికి బాధ్యతాయుతంగా సమన్వయంతో కృషి చేయాలి

Date : 01 May 2026 07:59 PM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 01 : జిల్లా సమగ్ర అభివృద్ధికి దృఢమైన ప్రణాళిక... వేగవంతమైన చర్యల అమలు లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మదనపల్లి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, భూసంబంధిత అంశాలు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పరిశ్రమలు, వివిధ శాఖలలో అభివృద్ధి మరియు మౌలిక వసతులు తదితర అంశాలపై విస్తృత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరును సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి... పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల లక్ష్యం, సాధించిన ప్రగతిని సమీక్షించారు. రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి, 22A ఫైళ్లు, డాటెడ్ ల్యాండ్ కేసులు, ప్రత్యేక కేటగిరీ ROR కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. భూ రికార్డుల డిజిటైజేషన్ పూర్తి చేసి పారదర్శకతను పెంచాలని, ప్రభుత్వ భూముల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మదనపల్లి సమీపంలోని లేఅవుట్‌లలో ఖాళీ స్థలాలను గుర్తించి ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రభుత్వ భూములపై కేఎంఎల్ ఫైళ్ల సిద్ధతను పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి పనులకు సంబంధించిన పెండింగ్ చెల్లింపులను త్వరగా విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని, సోలార్ పార్క్, పిఎం కుసుమ్ పథకాల భూసంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పరంగా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ, ఉప కాలువల భూసేకరణ, చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని, శ్రీనివాస పురం, అడవిపల్లి రిజర్వాయర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఇతర సాగునీటి ప్రాజెక్టులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పరిశ్రమల అభివృద్ధి కోసం మైనింగ్ లీజుల ఎన్ఓసి లను త్వరగా క్లియర్ చేయాలని, వాటర్ గ్రిడ్ పనులకు అవసరమైన బ్లాస్టింగ్ అనుమతులను సమయానికి మంజూరు చేయాలని చెప్పారు. ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. టమోటా మార్కెట్ యార్డ్ మార్పిడి, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ డిపిఆర్ సిద్ధత, పీలేరు ఆర్డిఓ కార్యాలయం మరియు ఇతర మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయా శాఖలను క్లెయిమ్ చేయని డిపాజిట్ల బదిలీ ప్రక్రియ, బ్యాలెన్స్ కౌంటర్ అఫిడవిట్స్, ఆటోమేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రజా సానుకూల అవగాహన - సంతృప్తి స్థాయి పెరగాలి* రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలపై ప్రజా సానుకూల అవగాహనను పెంచాలి. చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల అమలు, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సేవలపై ప్రజలలో తగిన అవగాహన కల్పించి సానుకూల దృక్పథం సంతృప్తస్థాయి పెరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పెండింగ్ అంశాలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు

ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: