Thursday, 30 July 2026 03:36:08 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ లో ఇండస్ట్రియల్ మూవీ వర్క్ షాప్

ఆర్ట్స్ & కల్చరల్ క్లబ్, ఫిలిం మేకర్స్ క్లబ్ సంయుక్తంగా ఇండస్ట్రియల్ మూవీ వర్క్‌షాప్

Date : 05 February 2026 09:16 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 05 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ మరియు ఫిలిం మేకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ మూవీ వర్క్‌షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మూవీ ప్రొడ్యూసర్ అరవింద్ మండెం మరియు డైరెక్టర్ మధుదీప్ పాల్గొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ నేటి ఇంజినీరింగ్ విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో కూడి ఉండాలని తెలిపారు. ఇంజినీరింగ్‌లో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానం సినిమా రంగంలో ఆధునిక టూల్స్ వినియోగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని, నిరంతర సాధన, సరైన మార్గదర్శనం మరియు ప్రాక్టికల్ అనుభవం ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకుని ఇష్టమైన రంగంలో విజయం సాధించవచ్చు అని అన్నారు. చిత్ర పరిశ్రమ పై ఆసక్తి గల విద్యార్థులకు పరిశ్రమల్లో జరుగుతున్న ప్రక్రియలను వీడియో రూపంలో ఎలా చూపించాలి, టెక్నికల్ విషయాలను సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. కెమెరా హ్యాండ్లింగ్, వీడియో ఎడిటింగ్, ప్రొడక్షన్, ప్రెజెంటేషన్ స్కిల్స్ వంటి అంశాలు నేర్చుకోవడం ద్వారా సినీ పరిశ్రమలో ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ కన్వీనర్ వై.ప్రదీప్ కుమార్, ఫిలిం మేకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ రియాజ్ అలీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: