నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 24 : విద్యుత్ బిల్లులు కచ్చిదారులు బిల్లులు చెల్లింపుకు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్లైన్ ద్వారా బిల్లులు చెల్లించాలని అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ బావా జాన్ తెలిపారు. బుధవారం ఆయన విద్యుత్ శాఖ ఎఈ సురేంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ లతో కలసి మండల కేంద్రంలో నివాస గృహాలు,పలు దుకాణాలు, కార్యాలయాలు తిరిగి అధికారులు, ప్రజలకు విద్యుత్ బిల్లులు ఆన్లైన్ తో పాటు స్కానర్స్, ఫోన్ పే,డిపార్ట్మెంట్ యాప్ ద్వారా బిల్లులు చెల్లించాలని అవగాహన కల్పించారు. వారి వెంట ఈ ఆర్ బి లు భాస్కర్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి, డ్యూటీ ఆపరేటర్ భాస్కర్ తదితరులు ఉన్నారు
Reporter
Namitha News