Wednesday, 29 July 2026 03:23:20 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

పి.యం. విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్ కమ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు

Date : 13 March 2026 10:52 PM Views : 280

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -మార్చి 13 : MSME –డెవలప్‌మెంట్ & ఫెసిలిటేషన్ ఆఫీస్ విశాఖపట్నం ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల కేంద్రం , డి.ఆర్.డి.ఏ. మరియు మెప్మా అన్నమయ్య జిల్లా సహకారంతో మదనపల్లె లో నిర్వహిస్తున్న పి.యం. విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్ కమ్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదన రావు మదనపల్లి పట్టణంలోని శుక్రవారం ఉదయం శివాజీ నగర్, సీటీఎం రోడ్ వద్ద ఉన్న పద్మావతి కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ ప్రారంభించి స్టాళ్లను సందర్శించి కళాకారుల ఉత్పత్తులను పరిశీలించారు

ఈ సందర్భంగా డి.ఆర్.ఓ. మధుసూదన రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM విశ్వకర్మ పథకం ద్వారా సంప్రదాయ వృత్తుల కళాకారులకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందుతుందని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు నిర్వహించడం ద్వారా కళాకారుల హస్తకళా ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెరిగి వారి జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. మార్చి 13 నుండి 15 వరకు మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన కు సందర్శించారు. స్టాళ్లు ఏర్పాటు చేసి, వడ్రంగి, స్వర్ణకారులు, శిల్పులు, కుమ్మరి, కమ్మరి, ధోబీలు, బొమ్మల తయారీదారులు, పనిముట్ల తయారీదారులు, తాళాల తయారీదారులు, చెప్పుల తయారీదారులు, గంపలు/చాపలు తయారీదారులు, కొబ్బరి పీచు నేతకారులు, క్షురకులు, పూలదండల తయారీదారులు, చేనేత, చేపల వలల తయారీదారులు వంటి పలు సంప్రదాయ వృత్తులకు చెందిన కళాకారులు పాల్గొన్నారని,ఈ ఎగ్జిబిషన్ ద్వారా హస్తకళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే కాకుండా తయారీదారులు, వ్యాపారులు మరియు వినియోగదారులు పరస్పరం ప్రత్యక్షంగా కలుసుకునే వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు

ఈ కార్యక్రమం లో మురళీమోహన్ డైరెక్టర్ ఏపీ ఏం.ఎస్.ఏం.ఈ, డిసి., ప్రాజెక్ట్ డైరెక్టర్, మెప్మా పి.లక్ష్మీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ నాగేశ్వరరావు , ఆర్ సంజయ్ కుమార్ జాయింట్ డైరెక్టర్ ఎం.ఎస్.ఎం.మీ డిఎఫ్ఓ విశాఖపట్నం, ఎల్డిఎం జి.ఆంజనేయులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, డాక్టర్ రాటకొండ గురు ప్రసాద్ కరస్పాండెంట్ అండ్ మెంబర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, పవన్ కుమార్ డైరెక్టర్ ఆర్.ఎస్.ఈ.టి.ఐ. ఎం నాగార్జున సీనియర్ మేనేజర్ ఐపిపిబి, విజయ్ విహారి డిప్యూటీ డెవలప్మెంట్ మేనేజర్ నాబార్డ్, తదితర సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :