Thursday, 30 July 2026 03:47:43 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై స్పెషల్ డ్రైవ్

Date : 20 January 2026 06:22 PM Views : 172

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై స్పెషల్ డ్రైవ్ పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి, వాహనాల రాకపోకలను సుగమం చేసేందుకు, మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ గురునాథ్, ఎస్ఐ గాయత్రి ఆధ్వర్యంలో 10 మంది సాయుధ పోలీసులు స్థానిక సిటియం రోడ్డులోని టౌన్ బ్యాంక్ నుండి అంబేడ్కర్ సర్కిల్ వరకు తనిఖీలు చేపట్టారు. రోడ్లపైకి చొచ్చుకొచ్చిన షాపుల బోర్డులను తొలగించి, ఫుట్‌పాత్‌లను ఆక్రమించకూడదని వ్యాపారస్తులను హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లైసెన్స్, సరైన పత్రాలు కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. నో-పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలిపిన వారికి జరిమానా విధించి నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు ఉంచాలని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజలు, వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :