Wednesday, 29 July 2026 04:54:21 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మోహన్ బాబు, మంచు విష్ణు లపై పీడియాక్ట్ , రౌడీషీట్ ఓపెన్ చేయాలి

ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ యుఐ, ఏ ఐ ఎస్ఎఫ్, వై యస్ఆర్ స్టూడెంట్ యూనియన్, డిబిఎస్ఎఫ్ విద్యార్థి డిమాండ్

Date : 04 February 2026 07:18 PM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మోహన్ బాబు, మంచు విష్ణు లపై పీడియాక్ట్ , రౌడీషీట్ ఓపెన్ చేయాలి -- ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ యుఐ, ఏ ఐ ఎస్ఎఫ్, వై యస్ఆర్ స్టూడెంట్ యూనియన్, డిబిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల డిమాండ్ -- అక్రమంగా వసూలు చేసిన రూ. 27 కోట్లను తిరిగి విద్యార్థుల ఖాతాలో జమ చేయాలి -- మోహన్ బాబు యూనివర్సిటీ ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి మోహన్ బాబు యూనివర్శిటీ అక్రమాలపై గొంతు విప్పేందుకు ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులపై మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, మంచు విష్ణులు భరితెగించి బౌన్సర్లను ఉపయోగించి కిరాయి గూండాలతో కిడ్నాప్ చేయించడం దుర్మార్గమని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బుధవారం పట్టణంలోని బీసెంట్ సర్కిల్ నందు ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్ యుఐ, ఏ ఐ ఎస్ఎఫ్, వైయస్సార్ స్టూడెంట్ యూనియన్, డిబిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మోహన్ బాబు మంచు విష్ణు ఫోటోలను దహనం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమృత్ తేజ, వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ కూమార్ మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడి దందాను ఎస్ఎఫ్ఐ నాయకులు ఇతర విద్యార్థి సంఘాలు కలుపుకొని దశలవారు పోరాటాలు నిర్వహిస్తుంటే ఆ పోరాటాలు ద్వారా ప్రభుత్వానికి రూ. 27 కోట్లు ఎక్కడ విద్యార్థులకు జమ చేయాల్సి వస్తోందనని యాజమాన్యం భయంతో ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని పూర్తిగా కిడ్నాప్ చేసి భయపెట్టి హత్య చేయాలని పథకం ప్రకారమే మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు మంగళవారం కిడ్నాప్ చేయడం జరిగిందన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం గతంలో మోహన్ బాబు కూడా మీడియా పైన దాడి చేసిన ఘటనలు ఉన్నాయని‌ గుర్తు చేశారు. తక్షణమే లా అండ్ ఆర్డర్ ను విగాథం కలిగించిన మోహన్ బాబు యూనివర్సిటీ పై అదేవిధంగా పిఆర్ఓ సతీష్ మంచు విష్ణుల పై రౌడీషీట్, పీడి యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనీసం మోహన్ బాబు కళాశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడీ పైన కానీ, మంగళవారం జరిగిన కిడ్నాప్ వ్యవహారం పైన గాని రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంటే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముగాస్తుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయన్నారు. అలా కాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మోహన్ బాబు యూనివర్సిటీ పైన విచారణ కమిటీ వేసి నిజ నిజాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. హోం మంత్రి అనిత, జరిగిన కిడ్నాప్ వ్యవహారంపై సమగ్రమైన సమాచారం తీసుకొని వాళ్లపైన శాఖపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా రౌడీషీట్, పీడి యాక్ట్ పెట్టేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. యూనివర్సిటీలలో బౌన్సర్లు వ్యవహారంపై న విచారణ చేయాలన్నారు. విద్యాసంస్థల్లో గుండాయిజం చేయడానికి ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ పై చర్యలు తీసుకోవాలన్నారు. అయ్యా మోహన్ బాబు ఇది సినిమా యాక్టింగ్ కాదు నీ తాటాకు చప్పుళ్లకు భయపడడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని, మీ మెడలు వంచైనా సరే విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు విద్యార్థి సంఘాల ఐక్యవేదికగా నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్, వైయస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ కుమార్, ఎఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సాయికుమార్, డి బి ఎస్ ఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భాను , ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆఫ్రిద్, ప్రేమ్ కుమార్, సంతోష్,‌ బన్నీ ఇతర విద్యార్థి సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. మోహన్ బాబు, మంచు విష్ణు పై పీడీయాక్ట్, రౌడీషీట్ ఓపెన్ చేయాలని ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాలు మోహన్ బాబు, విష్ణు ఫోటోలను దహనం‌ చేస్తూ నిరసన తెలుపుతున్న. విద్యార్థి సంఘాలు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :