Thursday, 15 January 2026 12:01:38 PM
# శ్రీజ డైరీ ఆధ్వర్యంలో రంగవల్లుల తో పులకించిన రెడ్డికోట # బుడి బుడి అడుగుల చిన్నారుల గొబ్బిళ్ళు ఆట # 11 మంది జూదరులు అరెస్ట్,రూ 5900/- స్వాధీనం # నిస్వార్ధమైన ప్రజాసేవకుడు కమ్మల రఘు # సత్ సంఘ్ ఫౌండేషన్స్ తో మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ యం.ఓ.యు. # ధాత్రి ఆనంద నిలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. # వైయస్సార్ టీచర్స్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించిన నిస్సార్ అహమ్మద్ # వైద్య కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేయాలి - సీపీఐ # స్టోర్ కింగ్ కంపెనీ కి ఎంపికైన విశ్వం విద్యార్థులు # సదుం యస్.ఐ. గా బాధ్యతలు చేపట్టిన విష్ణు నారాయణ # వైద్య కళాశాల లను ప్రవేట్ పరం చేసే జి.ఓ. ప్రతులను భోగి మంటల్లో వేసిన సిపిఐ నాయకులు # రోడ్డు భద్రత పై ద్విచక్ర వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్న ఆర్.టి.ఏ. అధికారులు # ఆత్మకూరు పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు సంక్రాతి శుభాకాంక్షలు - విద్యుత్ ఏ.డి.ఏ. చిన్నస్వామి నాయక్ # డి.ఆర్.డి.ఓ. వేసవికాలం ఇంటర్న్ షిప్ కు ఎంపికైన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లి బాధితులకు సి.యం.ఆర్.ఎఫ్. చెక్కులు పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే # మదనపల్లి పట్టణం లో 2.5 కోట్ల రూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజలు # తెట్టు లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు, రెండు కేజీ ల గంజాయి స్వాధీనం # మంత్రి మండిపల్లి ని కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు # జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

సత్ సంఘ్ ఫౌండేషన్స్ తో మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ యం.ఓ.యు.

Date : 14 January 2026 06:05 PM Views : 18

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 14 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టూబి యూనివర్సిటీ తో ప్రముఖ సామజిక వేత్త, పద్మభూషణ్ డాక్టర్ మొహమ్మద్ అలీ వారి సత్సంగ్ ఫౌండేషన్ కు చెందిన స్వస్థత హాస్పిటల్ తో మిట్స్ డీమ్డ్ టూబి యూనివర్సిటీ తో ఎం.ఓ.యు. చేయడం జరిగింది. ఈ సందర్బంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్ స్వస్థత హాస్పిటల్ యాజమాన్యం తో మిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభం నుండి యూనివర్సిటీ స్థాయికి వచ్చిన ప్రస్థాణం గురించి తెలిపారు..మిట్స్ డీమ్డ్ టూబి యూనివర్సిటీ నందు యాజమాన్యం విద్యార్థులకు, అధ్యాపకులకు, టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బందికి, అందిస్తున్న మౌళిక వసతులు, మిట్స్ విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో వారు పొందిన ఉద్యోగాలు గురించి తెలిపారు.. కార్యక్రమంలో స్వస్థత హాస్పిటల్ డాక్టర్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ తమ సత్సంగ్ ఫౌండేషన్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గిరిజనులు, పేదవారికి ఉచితంగా అందిస్తున్న విద్య, వైద్యం, తాగునీరు, గురించి తెలిపారు.. అంతే కాకుండా మొహమ్మద్ అలీ (ఎం ) మదనపల్లిలోని నక్కలదిన్ని వద్ద అదునాతన సౌకర్యలతో పేద ప్రజల కోసం స్వస్థత హాస్పిటల్ నిర్మించరని, హాస్పిటల్ నందు డెంటల్, ఆర్థో, గైనిక్, అప్తామా, న్యూరో వంటి జబ్బులకు ప్రముఖ పేరు పొందిన డాక్టర్స్ బృందం ఉన్నదని, పేదవారికి కేవలం బెడ్ ఛార్జ్, ల్యాబ్ చార్జస్సెస్ మాత్రమే తీసుకుంటూ మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామని,అదే విదంగా మిట్స్ విద్యార్థులకు, అధ్యాపకులకు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఉచితంగా కన్సల్టేన్సీ ఇస్తామని తెలిపారు.. మిట్స్ డీ మ్డ్డ్ టూబి యూనివర్సిటీ వారితో ఎం.ఓ.యు. చేయడం చాలా సంతోషం గా ఉందని తెలిపారు.. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్, ఎగ్జిగూటివ్ డైరెక్టర్ రవికుమార్, రిజిస్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్, వివిధ డిపార్ట్మెంట్ విభాగాదిపతులు, స్వస్థత హాస్పిటల్ ఆర్.ఎం.ఓ. డాక్టర్ ఆదర్శ్ రెడ్డి, అడ్మిన్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :