నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలు ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు చైతన్య స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు... ఈ కార్యక్రమంలో సమస్త వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ గారు మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులు పిల్లలు గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ కవిత రాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నాం అమ్మ ప్రేమ తెలుగు,ఆత్మీయత తెలుగు, అనుబంధం తెలుగు, ఇది లేదంటే లేదు వెలుగు... ఎంతోమంది తెలుగు కవులు ఉన్న మన తెలుగు రాష్ట్రాలలో కుటుంబ వ్యవస్థ నుంచి తెలుగు పట్ల పిల్లలకు అవగాహన కలిగించి మమ్మీ డాడీ అని కాకుండా అమ్మ నాన్న అనే సంస్కారం తల్లిదండ్రుల నుంచి రావాలని ప్రపంచంలోనే తెలుగు మాట్లాడేవాళ్లు నలుమూలల వెళ్లిన ఉంటారని అందుకే ప్రపంచ భాషలలో 16వ స్థానం తెలుగు భాష అని కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందంన్ గారు మాట్లాడుతూ పాఠశాలలో కచ్చితంగా తెలుగు పీరియడ్లలో కచ్చితంగా 45 నిమిషాలు తెలుగు ఉపాధ్యాయులు తెలుగునే ప్రసంగించాలి... అని హితవు పలికారు.. ఈ కార్యక్రమంలో పిల్లలు ఉపన్యాసాలతో తెలుగు పాటలతో తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు..కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముత్తు ఆంగ్ల మధ్యన పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులు చిన్నారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News