Thursday, 16 April 2026 04:57:35 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

రైతుల ముంగిటికే ప్రభుత్వ సేవలు - ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

Date : 06 March 2024 09:11 PM Views : 309

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లక్కిరెడ్డి పల్లి : రైతుముంగిటకే ప్రభుత్వ సేవలు రైతు భరోసా కేంద్రం రైతులకు ఒక దేవాలయం రైతులకు విజ్ఞానకేంద్రాలుగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గ్రామంలోని చౌటపల్లెలో రైతు భరోసా కేంద్రం ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి జగన్ ప్రభుత్వం రైతు ముంగిటకే ప్రభుత్వ సేవలను అందిస్తోందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.బుధవారం లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గ్రామంలోని చౌటపల్లె లో నూతన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర ప్రారంభంలో ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ అంబాబత్తిన రెడ్డయ్య , స్థానిక సర్పంచులు వెంకటనారాయణ రెడ్డి , గడ్డం కళ్యాణి ప్రభాకర్ రెడ్డి లతో కలిసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి ,సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో రైతుల ముంగిటకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా ఉన్న రైతు భరోసా కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకొని సేవలను పొందాలని కోరారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలను ,మందులను అందించడం జరుగుతొందన్నారు అంతేకాక గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, సిబ్బంది అందుబాటులో వుండి రైతులకు అవసరమైన సలహాలు , సూచనలతోపాటు అవసరమైన ఇతర సేవలను అందించడం జరుగుతొందన్నారు.రైతు భరోసా కేంద్రం రైతులకు ఒక దేవాలయంలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రమేష్ బాబురావు, గంగమ్మ ఆలయ చైర్మన్ మురికి నాటి రెడ్డయ్య, వైఎస్ఆర్సిపి నాయకులు గడ్డం జనార్దన్ రెడ్డి, మాజీ గంగమ్మలయ చైర్మన్ సామాల నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రాజబాబు,లక్కిరెడ్డిపల్లె ఉప సర్పంచ్ రాజారెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు ఆనంద విజయ్ కుమార్, మోహన్ కుమార్, గణపతి, సుదర్శన్ రెడ్డి, చంద్రశేఖర్, ఓబులేసు, గంగరాజు, నాగార్జున, గంగయ్య, సచివాలయ సిబ్బంది ,గ్రామ వాలంటీర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :