నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 04 : దివ్యాంగులు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉమర్ ఫరూక్ సూచించారు. గురువారం స్థానిక భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తి దివ్యాంగుల చేత కేక్ కట్ చేయించి పంచిపెట్టి వారిని మనసారా ఆశీర్వదించారు. దివ్యాంగులు ఎందులో తక్కువ కాదని వారిలో విద్యతోపాటు మానసిక ఉల్లాసం, శారీరిక దృఢత్వం పెంపొంది అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడవాలని ఆకాంక్షించారు. దివ్యాంగుల పై వివక్ష చూపరాదని వారిని ప్రతి ఒక్కరు అందరితో సమానంగా ఆదరించాలని సూచించారు. అనంతరం పలు రకాల పోటీలలో రాణించిన దివ్యాంగులకు న్యాయమూర్తి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీనివాసులు, టీచర్ సాంబశివ, ఐఈఆర్టీ టీచర్లు రేఖ , శ్రావణి, ఫిజియోథెరపీ సరళ, ఎంఆర్పి సుధాకర్, కేర్ టేకర్ నాగరత్నమ్మ, దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Reporter
Namitha News