నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా:రాయచోటి నియోజకవర్గం.లక్కిరెడ్డిపల్లి టౌన్ ఫైర్ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ అగ్నిమాపక వాహనం ద్వారా సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుతాయని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత బలోపేతం అవుతాయని, అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News