నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 09 : మదనపల్లి పట్టణం లోని అయ్యప్ప స్వామి దేవస్థానం నందు త్వరలో జరగనున్న గో పూజా, గ్రామోత్సవం సన్నాహక సమావేశం నిర్వహించి కార్యక్రమం ఎలా, ఏ కార్యక్రమాలు నిర్వహించాలో తదితర అంశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, కూటమి నాయకులు రాందాస్ చౌదరి, బిజిపి నేతలు పులి నరేంద్ర కుమార్ రెడ్డి, బండి ఆనంద్, హిందూ చైతన్య వేదిక బండి బాలాజీ , బీజేపీ నాయకులు పి భగవాన్, జర్మన్ రాజు, పిల్ల స్వామి నాయక్, మఠం కిరణ్, శ్రీకాంత్, టీడీపీ, జనసేన మరియు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News